మ‌ళ్లీ ప్ర‌భాస్ కంటే ముందే కానిచ్చేసిన‌ పూజా హెగ్డే?!

July 1, 2021 at 10:42 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఇక ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌డంతో.. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె రీ స్టార్ అయింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నారు మేక‌ర్స్‌.

అయితే ప్ర‌తి షెడ్యూల్‌లోనూ ప్రభాస్ కన్నా ముందే తన షూట్ ను కంప్లీట్ చేస్తున్న‌ పూజా.. ఈసారీ అదే చేసింద‌ట‌. ప్ర‌భాస్ కంటే ముందుగానే.. పూజా ఆ షూటింగ్ పార్ట్‌ను కానిచ్చేయ‌డంతో పాటు వేరే సినిమా షూట్‌లో కూడా పాల్గొంద‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌న పూజా జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌ళ్లీ ప్ర‌భాస్ కంటే ముందే కానిచ్చేసిన‌ పూజా హెగ్డే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts