ప్ర‌ముఖ ఓటీటీలో ర‌విబాబు `క్ర‌ష్‌`..విడుద‌ల ఎప్పుడంటే?

July 1, 2021 at 11:36 am

ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు నూత‌న తారాగ‌ణంతో తెర‌కెక్కిన తాజా చిత్రం క్ర‌ష్‌. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై స్వ‌యంగా ర‌విబాబే నిర్మించారు. ఈ చిత్రంలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పర్రీ పాండే, శ్రీ సుధారెడ్డి కీల‌క పాత్ర పోషించారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కు వెళ్ళింది. అయితే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు.. ఏకంగా 9 కట్స్ చేయాలని తీర్మానించారు. అయితే సెన్సార్ వాళ్ళు చెప్పిన సన్నివేశాలను కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు.. క్ర‌ష్‌ను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Image

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5 క్ర‌ష్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు, తాజాగా జూలై 9వ తేదీ సినిమాను స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించింది. మ‌రి అడల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుంటోంది చూడాలి.

ప్ర‌ముఖ ఓటీటీలో ర‌విబాబు `క్ర‌ష్‌`..విడుద‌ల ఎప్పుడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts