న్యూ సినిమా మొదలు పెట్టిన రవి తేజ..!

July 1, 2021 at 11:51 am

మాస్ మహారాజా రవితేజ రీసెంట్‌గా క్రాక్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఆయ‌న ఖిలాడి మూవీ సెట్స్ మీద‌ ఉండగానే మరో కొత్త మూవీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విష‌యం విదిత‌మే. రవితేజ చేస్తున్న 68వ మూవీతో శరత్ మండవ అనే కొత్త డైరెక్ట‌ర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ప్ర‌ముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణం చేప‌డుతున్నారు.

#RT68 అనే ట్యాగ్‌తో రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ చేస్తున్నారు మూవీ టీమ్‌. కాగా ఈ షెడ్యూల్ లో రవితేజతో పాటు ఇతర ప్రధాన న‌టీ న‌టులు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే #RT68 మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను చిత్ర మేక‌ర్స్ రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ పోస్ట‌ర్‌లో రవితేజ ఓ కుర్చీపై కూర్చోని ఉండ‌టాన్ని బ‌ట్టి ఆయ‌న ఓ ప్రభుత్వ అధికారిగా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

న్యూ సినిమా మొదలు పెట్టిన రవి తేజ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts