పేద విద్యార్థుల కోసం సోనూసూద్ వ‌రం..!

July 1, 2021 at 11:46 am

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క వ్య‌క్తి పేరు సోనూసూద్ అనే చెప్పాలి. ఇప్ప‌టికే ఆయ‌న కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ పేదోళ్ల‌కు సాయం అందిస్తున్నారు ఆయ‌న‌. ఈ కార‌ణాల‌తోనే ఆయన రియల్ హీరోగా వెలువొందుతున్నారు. గ‌తేడాది దేశంలో లాక్ డౌన్ అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఆయ‌న చేస్తున్న సేవ‌లు ఎన‌లేనివ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఆయ‌న పే విద్యార్థుల కోసం సోనుసూద్ గొప్ప వ‌రాన్ని ప్ర‌క‌టించి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. సీఏ చ‌ద‌వాల‌నుకునే వారికి దాన్ని ఫ్రీ కోచింగ్ ద్వారా అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం త‌మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఫ్రీగా కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని సోనూసూద్ ప్ర‌క‌టించారు. ఈ కోచింగ్ సెంట‌ర్ల‌లో ఇంట‌ర్న్‌షిప్‌తో పాటు కోచింగ్ అలాగే ప్లేస్‌మెంట్‌ల‌ను అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌మ ట్రస్టు ఆధ్వ‌ర్యంలోనే పేద స్టూడెంట్ల‌కు వీటిని అందిస్తామ‌ని సోనూసూద్ ట్వీట్ చేశారు. ఎవరైనా సీఏ చ‌ద‌వాల‌నుకునే వారు త‌మ ట్ర‌స్టు వెబ్‌సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని సోనూసూద్ సూచించారు.

పేద విద్యార్థుల కోసం సోనూసూద్ వ‌రం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts