ఆలీకి ఆ హీరో అభిమానులు బెదిరింపులు..ఏం జ‌రిగిందంటే?

July 1, 2021 at 8:28 am

క‌మెడియ‌న్ ఆలీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 900 సినిమాల్లో నటించిన ఆలీ.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్ర‌స్తుతం ఆలీ సినిమాల‌తో పాటుగా.. టీవీ షోలు కూడా చేస్తున్నారు.

ఈయ‌న చేస్తున్న షోల‌లో అలీతో సరదాగా ఒక‌టి. సినీ ప్ర‌ముఖుల‌ను ఈ షోలో ఆలీ ఇంట‌ర్వ్యూ చేస్తుంటాడు. అయితే పిలిచిన వాళ్లనే మళ్లీ మళ్లీ పిలిచి విసుగు తెప్పించకపోతే.. కొత్త వాళ్లని, తెరమరుగైన అలనాటి స్టార్స్‌ను షోకు తీసుకోరావ‌చ్చుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరో వడ్డే నవీన్‌ని తీసుకురావాల‌ని ఆయ‌న అభిమానులు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

Vadde Naveen Photos, Pictures, Wallpapers,

ఒకరిద్దరు కాదు.. చాలామంది ప్రతివారం ప్రతి ప్రోమో, ఎపిసోడ్‌కి వ‌న్డే న‌వీన్ తీసుకురావాల‌ని కామెంట్లు పెడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. అభిమానులు ఈ సారి బెదిరింపుల‌కు దిగారు. ఆలీ గారూ మర్యాదగా వడ్డే నవీన్‌ని పిలుస్తారా? లేదా? అంటూ ఓ రేంజ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా అభిమానుల కోరిక మేర‌కు వ‌డ్డే న‌వీన్ తీసుకువ‌స్తారా..లేదా.. అన్న‌ది చూడాలి.

ఆలీకి ఆ హీరో అభిమానులు బెదిరింపులు..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts