పవన్‌తో స్నేహం కోసం లీకులిప్పిస్తున్న చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటికి లభిస్తున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ఆయన వెన్నులో చలి మొదలైందా? అందుకోసం.. పవన్ కు ఉన్న అంతో ఇంతో బలాన్ని కూడా కలుపుకుని […]

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!

భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]

చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]

కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?

కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]

‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]

టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు […]

నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో […]

వర్లగారూ.. మీ మేడం లెటర్లో ఫైర్ ఉందా?

రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు […]