పవన్ కోసం మెగా ఫ్యామిలీ రెడీ…!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకొని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ గడప గడపకు అంటుంటే, టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. ఇక జనసేన కూడా వారాహి యాత్ర నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచారం […]

టీడీపీలో చక్రం తిప్పుతున్న బీసీ నేత…!

తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించని ధీమా వచ్చేసింది అనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలో గెలుపుపై ఆశలు వదులుకున్న నేతలు సైతం ఈ సారి భారీ మెజారిటీ ఖాయమని కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నేతలు పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంఛార్జులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయించడం […]

ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ పోటీ చేస్తారో తెలుసా…?

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇందుకు కీలక కారణాలున్నాయి. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో రాజధాని అమరావతి పరిధిలో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలో గుండె జగన్.. జగన్ అని కొట్టుకుంటుంది అంటూ మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇసుక ర్యాంపులు, పేకాట శిబిరాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది… మనకెంత ఇస్తారు…. అంటూ మాట్లాడిన ఆడియో కాల్ పెద్ద వైరల్ అయ్యింది. […]

హాట్‌ టాపిక్‌గా మునుగోడు నియోజకవర్గం

పోగొట్టుకున్న చోటే తిరిగి అధికారం చేజిక్కించు కోవాలనుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. మరోసారి కాంగ్రెస్ గూటికి చేరారు. రాజగోపాల్‌ రెడ్డి రీ ఎంట్రీతో నల్గొండ జిల్లాలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత 2018 ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన […]

ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే […]

చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారు…?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు విడుదల అవుతారు..? సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుంది..? తీర్పు ఎలా వస్తుంది..? ఏం జరగబోతోంది..? ఎక్కడా చూసినా కూడా ఇదే చర్చ. ఈనెల 30 నుంచి సుప్రీంకోర్టు పునఃప్రారంభమవుతోంది. ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు చంద్రబాబు బెయిల్ పిటిషన్ బదిలీ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా, ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఏం జరగబోతోందనే చర్చ కూడా అందరిలో ప్రారంభమైంది. అసలు చంద్రబాబు ఎప్పుడు విడుదల అవుతారని, కోర్టు తీర్పులు ఏం […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా? రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ […]

ప్రజాక్షేత్రంలోని నారా లోకేష్, భువనేశ్వరి… క్యాడర్‌ కోసమేనా…?

నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నారు. చంద్రబాబు లేకుండా జరుగుతున్న తొలి సమావేశంలో పార్టీ కీలక ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితోపాటు నారా లోకేష్ పర్యటనల షెడ్యూల్ ఖరారు కానున్నది. చంద్రబాబు అరెస్టుపై ఒకపక్క న్యాయ పోరాటం చేస్తూనే.. మరోపక్క ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన విధానంపై పార్టీ సమావేశం చర్చించనున్నది. నిలిచిపోయిన ”బాబు షూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” అనే కార్యక్రమాన్ని చంద్రబాబును […]