జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో చేర్చుకొని జగన్‌కు ముచ్చె మటలు పోయించారు.

జగన్‌ను వ్యూహాత్మకంగా రాజకీయంగా ఐదంచెల వ్యవస్దద్వారా ఇబ్బందులు పెట్టటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.1. జగన్ ఛానల్‌ను ఆంధ్రాలో ఆపివేయటం, 2.ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవటం, 3. జగన్ ఆర్దిక మూలాలపై దెబ్బ వేయటం, 4. సీబిఐ, ఈడిల ద్వారా అస్తులను స్వాధీనం చేసుకోవటం, 5. జగన్‌కు చెక్ పెట్టి ఆంధ్రాలో జీరో చేసేపనిలో చంద్రబాబు ఉన్నారు. అటు అన్నీ ఆలోచించిన జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి నిత్యం టచ్‌లో ఉంటూ వస్తున్నారు.పైగా చంద్రబాబుకు కూడా కేంద్రంలో ఆశించినస్దాయిలో సానుభూతిలేకపోవటంతో ఇప్పటిదాకా జగన్‌కు పూర్తిస్దాయిలో చెక్ పెట్టలేకపోయారు.కానీ జగన్ దూకుడు పెంచుతుండేసరికి రాష్ట్రప్రభుత్వం ఈడి అస్త్రం ప్రయోగించి…జగన్ ఆస్దుల ఎటాచ్‌మెంట్ కార్యక్రమం షూరూ చేసింది. తన రాజకీయ భవితవ్యాన్ని నిలుపుకోవాలంటే జగన్ ఈడి నుండి తప్పించుకోవాలి.ఈడి వ్యవహారాలన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలో ఉంటాయి.రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉన్నా సుప్రీం కేంద్రప్రభుత్వమే.కానీ వీటన్నింటిని తప్పించుకోవాలంటే జగన్‌కు కేంద్రం ఆసరా అవసరం.

ప్రస్తుతం కేంద్రపరిస్దితి ఆంధ్రాలో అభివృద్ది చేస్తున్నా బిజెపి బలం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లు ఉంది.ఈ నేపధ్యంలో ఒకరితో కలవకుండా ఎదుటిపార్టీలే తమలో కలిసే విధంగా బిజేపి పావులు కదుపుతోంది. ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ బిజెపీ సాయం పార్టీ పరంగా కోరే పరిస్దితిలేదు. జగన్‌కు ఉన్న ఇబ్బందులను అవకాశంగా మలుచుకోవాలని బిజేపి చూస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ గట్టెక్కాలంటే జగన్‌కు ఆసరా అవసరం. అలాగని బిజేపితో దోస్తీచేస్తే పార్టీపరంగా జగన్‌కు ఇబ్బందులు తప్పవు.జగన్‌కు ఎక్కువ ఓటుబ్యాంకు ముస్లిం, క్రిస్టియన్‌లు వీరిరివురు బిజేపి వ్యతిరేకం. ఒకవేళ జగన్ బిజేపితో లాలూచిపడితే పార్టీపరంగా వీరిని నష్టపోవల్సి ఉంటుంది.వీరిని నష్టపోతే తెలుగుదేశానికి బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. తద్వారా జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కోమాస్దితిలోఉంది.కాంగ్రెస్‌తో జతకడితే డెడ్ బాడీకి చికిత్స చేసినట్లే.దీంతో ప్రస్తుతం జగన్ పరిస్దితి ముందునుయ్యి వెనుక గొయ్యిగా మారింది. జగన్ మాత్రం చంద్రబాబు దూకుడుకు ఖంగుతింటున్నాడు.జగన్ ఆస్తులు ఈడి ఎటాచ్‌మెంట్‌తో వైసీపీ వర్గాలలోకూడా కలవరం మొదలైంది.జగన్ మళ్లీ జైలుకు వెళ్తాడా..? అనే పుకార్లతో పార్టీ నాయకుల్లో అలజడి మొదలైంది.ఒకవేళ జగన్ ఈ కేసుల్లో మరల జైలుకెళ్తే పరిస్తితి ఏంటని నాయకులు,ఎమ్మెల్యేలు మీమాంసలో పడ్డారు.దీన్ని అదునుగా తీసుకొని తెలుగుదేశంపార్టీ కూడా కొంతమంది ఆశావాహులు గాలం వేస్తుంది.దీంతో కొంతమంది శాసనసభ్యులు తెలుగుదేశంలో చేరేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలుగుదేశం జగన్ విషయంలో నెగ్గినట్లే.