పాపం ప‌వ‌న్‌… ఆ ఒక్క అవ‌కాశం కూడా ద‌క్కేలా లేదుగా…!

May 15, 2019 at 11:44 am

రాజ‌కీయాల్లో అవ‌కాశ‌వాదానికి ఎప్పుడూ చోటు ఉంటుంది. నాయ‌కులు ఎప్పుడూ కూడా త‌మ‌కు ఎటు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా దూకుడు గా ముందుకుసాగుతూ ఉంటారు. త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకుంటారు. ఏపీలోనూ ఇలాంటి ప‌రిణామాలు సాగాయి. వైసీపీ నుంచి గెలిచిన కొంద‌రు నాయ‌కులు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వారంతా కూడా పార్టీ మారి టీడీపీ త‌ర‌ఫున మంత్రులుగా చ‌లామ‌ణి అయ్యారు. అంటే, రాజ‌కీయాల్లో ఎటు అవ‌కాశం ఉంటే అటు.. వంగ‌డం అనేది కామ‌న్ ప్ర‌క్రియ. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి త‌ర‌హా వాతావ‌ర‌ణ‌మే మ‌న‌కు క‌నిపించింది. 

ఏపీలో ప్ర‌ధానంగా రెండు పార్టీలు పోటీ ప‌డ్డాయి. వైసీపీ, వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పోరు జోరు భారీగా సాగింది. అయితే, మ‌ధ్య‌లో వ‌చ్చిన జ‌న‌సేన కూడా ప్ర‌భావం చూపింది. దీంతో పోరు త్రిముఖం అయింది. అయితే, ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఉన్న జ‌న‌సేన ప్ర‌భావం ఎన్నిక‌లు వ‌చ్చేస‌మ‌యానికి త‌గ్గుముఖం ప‌ట్టింది. ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. బీఎస్పీ, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి పొత్తుగా ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. కొన్ని జిల్లాల్లో గ‌ట్టిగానే పోటీ చేశారు. ఇక‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది ఎందుకుఅంటే.. ప‌ద‌వులు అనుభ‌వించేందుకు, అధికారం చ‌లాయించేందుకు. పైకి ప‌వ‌న్ వీటికి తాను దూర‌మ‌ని చెప్పినా..లోలోన మాత్రం కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడ‌దా?  నేనే సీఎం అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. 

ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌ర్ణాట‌క త‌ర‌హా రాజ‌కీయాల‌కు తెర‌దీయాల‌ని ప్ర‌య‌త్నించారు. అక్క‌డ బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు పూర్తిస్థాయిలో మెజారిటీ రాలేదు. ఈక్ర‌మంలో కాంగ్రెస్‌తో ఎన్నిక‌ల అనంత‌ర పొత్తుకు సిద్ధ‌మైన జేడీఎస్ సీఎం ప‌ద‌విని త‌మ‌కు ఇస్తే.. మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించి స‌క్సెస్ అయింది. ఇదే త‌ర‌హాలో ఇక్క‌డ వైసీపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు రాక‌పోతే.. తానే చ‌క్రం తిప్పాల‌ని ప‌వ‌న్ భావించారు. కానీ, ఎన్నిక‌ల్లో స‌ర‌ళిని గ‌మ‌నించాక ప‌వ‌న్ ఈ ఆశ కూడా పోగొట్టుకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలిసింది. ఏపీలో క‌ర్ణాట‌క త‌ర‌హా ఫ‌లితం ఇచ్చేందుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు సిద్ధంగా లేక‌పోవ‌డం , అయితే టీడీపీ లేకుంటే వైసీపీ అనేత ర‌హాలోనే పోలింగ్ జ‌ర‌గ‌డంతో ప‌వ‌న్ ఆశ‌లు గ‌ల్లంతేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

పాపం ప‌వ‌న్‌… ఆ ఒక్క అవ‌కాశం కూడా ద‌క్కేలా లేదుగా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share