పడక సుఖం పంచితేనే హీరోయిన్ ఛాన్స్‌

May 18, 2017 at 10:44 am

అందం, అభిన‌యం ఉన్నా హీరోయిన్ రాయ్ ల‌క్ష్మికి ఎందుకోగాని స‌రైన ఛాన్సులు రాలేదు. అయితే ఇటీవ‌ల ఆమె స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగుల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ప‌వ‌న్ స‌ర్దార్ సినిమాలో తోబ తోబ‌, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 ర‌త్తాలు…ర‌త్తాలు ఐటెం సాంగులు ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇటీవ‌ల త‌ర‌చూ కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న ఆమె ఇండ‌స్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) దందా గురించి షాకింగ్ వ్యాఖ్య‌ల‌తో మరోసారి వార్త‌ల్లోకెక్కింది. ఎవ‌రైనా కెరీర్‌ను క‌ష్టంతో అల్లుకోవాలి గాని…. కానీ ఇండ‌స్ట్రీలో న‌వ్వారుతో అల్లేస్తున్నారు.. ఎన్నో క‌ల‌ల‌తో ఈ రంగుల ప్ర‌పంచంలోకి వ‌చ్చిన వాళ్ల‌ను రెండు కాళ్ల‌పై ఎద‌గ‌నీయ‌కుండా వాళ్ల‌ను నాలుగు కోళ్ల న‌వ్వారుపైకి లాగేస్తున్నార‌ని వాపోయింది.

కొంద‌రు ఫిల్మ్ మేక‌ర్స్ త‌మ స‌ర‌దాల కోసం, సుఖాలు అనుభ‌వించ‌డం కోసం పేరున్న ఆర్టిస్టులను సైతం వ‌ద‌ల‌డం లేద‌ని రాయ్ ల‌క్ష్మి నిర్మోహ‌మాటంగా త‌న వ్యాఖ్య‌ల‌ను కుండబ‌ద్ద‌లు కొట్టేసింది. త‌మ‌కు ప‌క్క సుఖం పంచేందుకు నిరాక‌రిస్తోన్న కొంద‌రు ఆర్టిస్టుల‌ను సినిమా ఛాన్సుల నుంచి త‌ప్పిస్తున్నార‌ని కూడా ఆమె బోల్డ్‌గా చెప్పేసింది.

 

పడక సుఖం పంచితేనే హీరోయిన్ ఛాన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share