శ్రీదేవి బలహీనతను బోనీ ఎలా వాడుకున్నాడంటే…

February 27, 2018 at 3:32 pm

సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం..ఒక్కసారి తెరపై కనిపిస్తే..చాలు జీవితం ధన్యమైతుందని భావించే వారు కోట్లలో ఉన్నారు.  అయితే సినిమా తెరపై కనిపించడం అంత సులువైన విషయం కాదు..టాలెంట్..అదృష్టం అన్ని ఉండాలి.  ఇక చిన్నవయసులోనే వెండితెరకు పరిచయం అయిన ప్రముఖ నటి శ్రీదేవి ఆ తర్వాత పదహారు సంవత్సరాలకే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ, హిందీ ఇండస్ట్రీలో శ్రీదేవి నటిస్తే..ఆ సినిమా సూపర్ హిట్ అనే స్థాయికి ఎదిగింది.  అందుకే ఆమెను జాతీయన నటి అంటారు.  ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకున్న శ్రీదేవి జీవితం కూడా కొన్ని కష్టాలు..కన్నీళ్లతోనే సాగింది.  

 

తెలుగు లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీదేవి అనూహ్యంగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  993లో హిమ్మత్‌ వాలా సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించిన శ్రీదేవి- చాలా తొందర్లోనే హిందీ సినీ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక 1987లో వచ్చిన మిస్టర్‌ ఇండియా సినిమా ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టింది.  అయితే బాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో గ్రేట్ డ్యాన్సర్ మిథున్ చక్రవర్తి ప్రేమలో పడిందని తర్వాత వీరిద్దకి 1985లో వారి వివాహం రహస్యంగా జరిగినట్లు, తొలి భార్య యోగిత బెదిరించడం వల్ల శ్రీదేవి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. 

2boney3--322

 

ఆ రూమర్లపై ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.  తర్వాత బోనికపూర్  జీవితంలోకి అనూహ్యంగా అడుగు పెట్టింది. బోనీ నివాసంలోనే మోనా దగ్గర కొన్నాళ్ల పాటు ఉంది! బోనీని ఆమె సోదరుడిగా భావించేదని, ఒకానొక సందర్భంలో ఆయనకు రాఖీ కట్టిందని మోనా సేవీ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.   1987లో తాను ప్రకటించిన భారీ బడ్జెట్‌ సినిమా ‘రూప్‌ కీ రాణీ.. చోరోం కా రాజా’ను బోనీ కపూర్‌ తన డబ్బంతా వెచ్చించి అనిల్‌ కపూర్‌, శ్రీదేవిలతో తీశాడు. 

 

ఆ సినిమా మధ్యలో డైరెక్టర్‌ మారడం, ఇతర కారణాల రీత్యా చిత్రీకరణ ఆలస్యమయ్యింది. 1993లో రిలీజైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో బోనీకపూర్ పూర్తిగా దివాలా తీయడంతో రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందట. ఆ సమయంలోనే   శ్రీదేవి కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నారు. మిథున్‌తో చెడిన బంధం ఒక పక్క బాధపెడుతుండగా ఆమె తల్లి రాజేశ్వరి అనారోగ్యానికి గురై మరణించింది. ఆస్తి విషయంలో చెల్లెలు శ్రీలత చేసిన మోసం ఆమెను కలచివేసింది. 

 

 ఈ సమయంలో శ్రీదేవికి అండదండగా బోనీకపూర్ ఉన్నారట. ఇదే సమయంలో శ్రీదేవి బలహీనతను ఆసరాగా చేసుకొని ఆమె పర్సనల్ జీవితంలోకి అడుగు పెట్టాడట..చివరకు 3 నెలల తరువాత బోనీతో సాన్నిహిత్యం పెంచుకున్న శ్రీదేవి ఆ క్రమంలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చినట్లు బాలీవుడ్‌లో గుప్పుమంది.. ఈ సమయంలో మరోసారి మోనా తెరపైకి వచ్చారు.   ‘‘నా కంటే బోనీ పదేళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకున్నాను. పదమూడేళ్ల సంసార జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు. అపుడు ఈమె (శ్రీదేవి) ప్రవేశించింది.. నేనేమైనా చేద్దామనుకుంటే ఆమె అప్పటికే గర్భి ణి..’’ అని మోనా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

585547sde

 

 ఆ సమయంలో బోనికపూర్, శ్రీదేవి సాన్నిహిత్యం బాగా పెరిగిపోవడంతో మోనాను ఇద్దరు పిల్లను వదిలేసి వచ్చాడట. అయితే 1997లో జాన్వి, 2000లో ఖుషి పుట్టాక మళ్లీ మోనాతో సంబంధాలు పునరుద్ధరించుకున్నారని తెలిసిన వారు అంటారు. పెళ్లయ్యాక ఆయనతోనే నిబద్ధతతో ఉన్నారు. కుమార్తె కెరియర్‌కు అ న్నింటికంటే ప్రాథాన్యం ఇచ్చారు’ అని బాలీవుడ్‌ సీ నియర్‌ సాంకేతిక నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

శ్రీదేవి బలహీనతను బోనీ ఎలా వాడుకున్నాడంటే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share