గుండెలు పిండేస్తా: అవసరాల.

September 7, 2016 at 2:42 pm

టీజర్‌, ప్రోమోస్‌, సాంగ్స్‌ అన్నీ పీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని తలపిస్తున్నాయి. సరదా సరదాగా సినిమా ఉంటుందేమోనని అందరూ అనుకుంటున్న వేళ, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’ సినిమా గురించి షాకింగ్‌ విషయం బయటపెట్డాడు. ఇందులో అనుబంధాలు అందర్నీ కట్టి పడేస్తాయన్నాడు. సున్నితమైన ఈ భావోద్వేగాల్ని ఎవరైనాసరే మనసుతోనే అర్థం చేసుకోగలరనీ, ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పాడు శ్రీనివాస్‌ అవసరాల. దర్శకుడిగా మారాక, ఎలాంటి సినిమాలు చేయాలి? అన్నదానిపై పూర్తి స్పష్టతతోనే ఉంటున్నాననీ, రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ చేసే ఉద్దేశ్యం ఎప్పటికీ లేదన్నాడు అవసరాల.

ముందుగా తెలుగు తెరకు కమెడియన్‌గా పరిచయమయ్యాడు అవసరాల. ‘అష్టాచెమ్మా’ నటుడిగా అతనికి మొదటి సినిమా. తొలి సినిమాతోనే కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. కామెడీలో తనదైన విలక్షణతను చూపించాడు అవసరాల. దర్శకుడిగా తీసిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతోనూ మంచి మార్కులేయించుకున్నాడు. ఆ సినిమాలోని హీరో నాగ శౌర్యతోనే ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చేసిన శ్రీనివాస్‌ అవసరాల, ఈ సినిమాతో మరో హిట్‌ కొట్టబోతున్నాడనడం నిస్సందేహం. నారా రోహిత్‌ ఈ సినిమాలో మరో హీరో. రెజినా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

గుండెలు పిండేస్తా: అవసరాల.
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share