అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన బన్నీ!

సునీల్‌తో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించిన నిక్కీ గల్రాని, ‘బుజ్జిగాడు’ ఫేం కన్నడ బ్యూటీ సంజన చెల్లెలు. మొదటి సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి ఫాలోయింగ్‌ బాగానే వచ్చింది ఆ సినిమాతో. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బావుంది. డాన్సులు బాగా చేస్తోంది. నటనలో కూడా మంచి మార్కులే వేయించుకుంది. అక్క సంజనతో పోలిస్తే చాలా ఎక్స్‌ట్రా క్వాలిటీస్‌ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మలో. అందుకే తెలుగులో మరో ఛాన్స్‌ దక్కించుకుంది. అది కూడా పెద్ద హీరో పక్కనే. అల్లు అర్జున్‌ తాజా చిత్రంలో ఈ ముద్దుగుమ్మకి ఛాన్స్‌ దొరికిందని సమాచారమ్‌.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పక్కన కేథరీన్‌ ఓ హీరోయిన్‌గా కన్‌ఫామ్‌ అయ్యిందని సమాచారమ్‌. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించే అవకాశం ఉంది. ఆ ముగ్గురులో నిక్కి గల్రాని ఒన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌ అట. అయితే నిక్కీ గల్రానికి ఏం పాత్ర దక్కుతుందో ఇంకా తెలిసి రావాలి. నిక్కీ మంచి డాన్సర్‌ ప్లస్‌ పెర్ఫామర్‌. సరైన ఛాన్స్‌ వస్తే సత్తా చాటడానికి ఆమె రెడీగానే ఉంది. మరింకేం ఆ బంపర్‌ ఆఫర్‌ బన్నీ లాంటి హీరోతో వస్తే వదులుకుంటుందా? చెలరేగిపోదూ! ఆమెలోని ఆ జోరు చూసే బన్నీ ఆమెకు ఆ అవకాశం కల్పించనున్నాడని సినీ వర్గాల్లో టాక్‌ వినవస్తుంది. అక్క సంజన హీరోయిన్‌గా తెలుగులో నిలదొక్కుకోలేకపోయింది. చెల్లి ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది ఆల్‌ ది బెస్ట్‌ టు నిక్కీ గల్రాని.