గోపీచంద్ ఇద్దరితో రొమాన్స్ కొత్తే

డైరెక్టర్‌ సంపత్‌ నంది యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో ఘనుడు. మరి ఆరడుగుల పర్సనాలిటీ ఉన్న గోపీచరద్‌లాంటి హీరో దొరికితే వచ్చే యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోంది ఓ యాక్షన్‌ మూవీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడట డైరెక్టర్‌ సంపత్‌ నంది.

ఇంతవరకూ తన సినిమాల్లో లేని యాక్షన్‌ సీన్స్‌ని ఈ సినిమాలో చూపించనున్నాడట డైరెక్టర్‌. మాస్‌ సినిమాల్ని క్లాస్‌గా డీల్‌ చేయడంలో సంపత్‌ నంది దిట్ట. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ తియ్యడంలోనూ సంపత్‌ నందికి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇంతవరకూ గోపీచంద్‌ సినిమాలకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే ఈ సినిమాకు కొంచెం భారీగానే బడ్జెట్‌ పెట్టనున్నారట.

వినోదం, యాక్షన్‌ ఈ రెండు అంశాలపై ఎక్కువగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేయనున్నారట. అంతేకాదు తొలిసారిగా గోపీచంద్‌ సరసన ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేథరిన్‌, హన్సిక ఇద్దరు భామలు తమ అందచందాలతో అలరించనున్నారు. మొదట్లో ఈ సినిమాకు కేథరిన్‌నే హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ ప్లేస్‌లోకి హన్సిక వచ్చి చేరింది. కానీ ఇద్దరు ముద్దుగుమ్మలను కథలో అడ్జస్ట్‌ చేశాడు డైరెక్టర్‌ సంపత్‌. ఈ ఇద్దరు భామల మధ్య గోపాలుడిలా గోపీచంద్‌ సతమతమయ్యే తీరు ఈ సినిమాలో వినోదాన్ని పండించే విధంగా ఉంటుందట. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో కూడా యాక్షన్‌ మూవీగా ఈ సినిమాని రూపొందించబోతున్నారట.