ప్రీ రిలీజ్ బిజినెస్ వావ్ అనిపిస్తున్న శాతకర్ణి

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఏ ముహూర్తాన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదలు పెట్టారో కానీ అప్పటి నుంచి ఇటు అభిమానుల్లో కానీ అటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అంచనాలు తార స్థాయికి చేరింది అనడం అతిశయోక్తి కాదు, ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలయ్య కెరీర్లోనే అత్యథిక మొత్తాలకు రైట్స్ అమ్ముడైనట్టుగా సమాచారం.

ఇక పోతే ప్రీ రిలీజ్ బిజినెస్లో దాదాపు 75 కోట్ల వరకు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రకు అత్యధికంగా 30 కోట్లు రాగా సీడెడ్ 9 కోట్లు, నైజాం 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి మరో 25 కోట్ల వరకు వచ్చుంటాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బాలయ్య ప్రీ రిలీజ్ లోనే 75 కోట్ల వసూళ్లు సాధించటంతో అభిమానులు పండగ చేసుకోవాల్సిన విషయమే.ఇక ఈ సినిమా కోసం అభిమానులు సంక్రాంతి పండగ వరకు వేచి చూడాల్సిందే.