శాతకర్ణి నైజాం రైట్స్ ఆ హీరో కొనేసాడు

రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.ప్రతిష్టాత్మక 100 వ సినిమా ఓ వైపు, సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండడం మరో వైపు,చారిత్రాత్మక కథానేపథ్యం ఇవన్నీ కలగలిసి బాలయ్య 100 వ సినిమా పైన అటు అంచనాలు ఇటు ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో వున్నాయి.

అయితే తాజాగా శాతకర్ణి నైజాం రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు.ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించాడు.బాలయ్య గారి ప్రతిష్టాత్మక 100 వ సినిమాని నైజాం లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది అంటూ దర్శకుఢుడు క్రిష్ కి నిర్మాత రాజీవ్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాడు నితిన్.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా పంపిణీదారుడిగా అపార అనుభవమున్న వ్యక్తి.ఇక నితిన్ ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ ఇంకో వైపు నిర్మాతగా ,పంపిణీ దారుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇప్పటికే అఖిల్ సినిమాకి నిర్మాతగా మారిన నితిన్ కి శాతకర్ణి తో మంచి సక్సెస్ రావాలని ఆశిద్దాం.