‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌

కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ త‌ర్వాత ఎన్నో ప్ర‌కంప‌న‌లు రేపిన విజ‌య్ మెర్స‌ల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డింది. ఈ సినిమా త‌మిళ‌నాడులో ఇప్ప‌ట‌కీ ఎన్నో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే రూ.240 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా త‌మిళ‌నాడులో ఆల్ టైం టాప్‌-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

త‌మిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ప‌లుసార్లు సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు న‌వంబ‌ర్ 9న గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చింది. సినిమాకు రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని వివాదాలు రావ‌డంతో ఇక్క‌డ కూడా మంచి హైప్ ఉంది. హైప్‌కు త‌గ్గ‌ట్టుగానే అదిరింది ఇక్క‌డ కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.51 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీకోసం.

అదిరింది ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్ల వివ‌రాలు (రూ.కోట్ల‌లో)

నైజాం – 1.45

సీడెడ్ – 0.63

ఉత్తరాంధ్ర – 0.66

గుంటూరు – 0.44

ఈస్ట్ – 0.41

వెస్ట్ – 0.26

కృష్ణ – 0.48

నెల్లూరు – 0.18

———————————-

ఆంధ్ర + తెలంగాణ = 4.51

———————————-