సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ “ఎవరు ” రివ్యూ &రేటింగ్

August 15, 2019 at 11:52 am

నటీనటులు: అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సినిమాటోగ్రఫర్ : వ‌ంశీ ప‌చ్చిపులుసు
మ్యూజిక్‌ : శ్రీచ‌ర‌ణ్ పాకాల
నిర్మాత‌లు: వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
దర్శకత్వం: వెంక‌ట్ రామ్‌జీ
రిలీజ్ డేట్‌: 15 ఆగ‌స్టు, 2019

అడ‌వి శేష్‌.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న న‌టుడు. ఎక్క‌డ కూడా పోటీ అనేదే లేకుండా.. త‌న‌దైన శైలిలో క‌థ‌ల‌ను ఎంచుకుంటూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముందుకు వ‌స్తాడు. క్ష‌ణం, గూఢ‌చారి సినిమాల‌తో తన టేస్ట్ ఏమిటో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌కు చూపించాడు. ఇక ఇప్పుడు కూడా అదే క్రైమ్ థ్రిల్ల‌ర్‌జాన‌ర్‌తో వ‌చ్చాడు. అడ‌వి శేష్‌, రెజీనా కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌రాం జీ రూపొందించిన చిత్రం ఎవ‌రు. ఈ సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల‌ను అమాంతంగా పెంచేసింది. ఇక అడ‌విశేష్ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా గురువారం విడుద‌ల అయింది. ఎవ‌రు.. ఏమేరకు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందో TJ స‌మీక్ష‌లో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

క‌థేమిటంటే…
ఈ సినిమా మొత్తం ఎక్కువ‌గా రెజీనాచుట్టూనే తిరుగుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో రెజీనా నటుడు నవీన్ చంద్రను హత్య చేస్తుంది. ఇక అప్ప‌టి నుంచి సినిమా కీల‌క మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేష‌న్‌ పోలీస్ అధికారి అడ‌వి శేష్. ఆయ‌న ప‌క్కా క‌రెప్టెడ్‌. ఈ కేసులో ఇరుక్కున్న రెజీనా ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది..? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది.? ఈ నేపథ్యంలో శేష్, రెజినాల మ‌ధ్య స‌న్నివేశాలు ఏమిటి..? అసలు రెజీనా ఆ హత్య ఎందుకు చెయ్యాల్సి వచ్చింది ? ఈ క్ర‌మంలో క‌థ‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు ఏమిటి.. చివరకు రెజీనా ఈ కేసు నుంచి బయట పడిందా లేదా అన్న విష‌యాల‌ను మాత్రం తెరపైనే చూడాలి మ‌రి. హిందీ బద్లా, ఇంగ్లీష్ వెర్షన్ లోని “ది ఇన్విసబుల్ గెస్ట్” చిత్రాలను పోలి క‌థాంశం ఉంటుంది.

ఎలా ఉందంటే..
త‌న‌కు బాగా క‌లిసివ‌చ్చే క‌థాంశంతో అడ‌విశేష్ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడ‌ని చెప్పొచ్చు. ఇక్క‌డ ప్ర‌ధాన అంశం ఏమిటంటే.. సినిమా నిడివి త‌క్కువగా ఉండ‌డం విశేషం. దీంతో క‌థానుసారంగా వ‌చ్చే ట్విస్ట్‌లు ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తాయి. అయితే.. సినిమా ఎక్కువ‌గా రెజీనా చుట్టూనే తిరుగుతుంది. ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే ట్విస్ట్‌తో రెండోభాగంపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తి క‌లుగుతుంది. రెండో భాగం కూడా మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్‌లు సూప‌ర్బ్ అనిపిస్తాయి. అయితే.. ఇక్క‌డ మరొక విష‌యం ఏమిటంటే.. రెండోభాగంలో అడ‌విశేష్ క‌నిపించే స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో ఆయ‌న అభిమానులు కొంత నిరుత్సాహానికి గుర‌వుతారు.

ఎవ‌రెలా చేశారంటే..
అడ‌విశేష్‌.. మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాను న‌డిపించాడ‌ని చెప్పొచ్చు. క‌రెప్టెడ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌ర్చాడు. ఇక రెజీనా త‌న‌పాత్ర‌లో ఒదిగిపోయారు. గ‌త సినిమాల‌కు.. ఈ సినిమాలోని ఆమె పాత్ర‌కు ఏమాత్రం పోలిక‌లే క‌నిపించ‌వు. న‌టిగా ఆమెకు ఎవ‌రు సినిమా ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఇతర పాత్రల్లో కనిపించినటువంటి నవీన్ చంద్ర మరియు మురళీ శర్మలు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు వెంకట్ రాం క‌థ‌ను ఎక్క‌డ కూడా గ‌జిబిజి లేకుండా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ఈ త‌ర‌హా క‌థాంశాల‌ ప్రేక్ష‌కుల నాడికిత‌గ్గ‌టుగా టేకింగ్ తీసుకున్నాడు. వంశీ పచ్చి పులుసు అందించిన సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకల అందించిన సంగీతం సినిమాకు అద‌న‌పు బ‌ల‌మ‌ని చెప్పొచ్చు.

ప్లస్‌లు (+) :
– అద్భుతమైన స్క్రీన్ ప్లే
– ట్విస్టులు
– రెజీనా మరియు శేష్ నటన
– సూప‌ర్ క్లైమాక్స్

మైనస్‌లు (-) :
– ఫస్ట్ హాఫ్‌లో కాస్త సాగదీత
– శేష్ పాత్ర తగ్గించడం

ఫైన‌ల్‌గా…
ఓ మిస్సింగ్ కేసు అండ్ ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఇంట్రస్టింగ్ ప్లేతో వ‌చ్చిన ఎవ‌రు బాగా అలరిస్తోంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి అలాగే కొత్తద‌నం కోరుకునే ప్రేక్షకులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకుల‌ను మెప్పిస్తుంది.

TJ ఎవ‌రు రేటింగ్‌: 3.25 / 5

సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ “ఎవరు ” రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share