అజ్ఞాత‌వాసి ఎఫెక్ట్‌… ఆయ‌న ఎవ్వ‌రితో మాట్లాడ‌డం లేదా..!

January 19, 2018 at 11:44 am

ఏదైనా ఒక సినిమా ప్లాప్ అయితే ఆ సినిమా మీద ఆధార‌ప‌డ్డ ఎంతోమంది జీవితాలు రివ‌ర్స్ అవుతాయి. ఆశ‌లు అడియాస‌లు అవుతాయి. ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బ‌తో చాలా మంది కుదేలు అయిపోయారు. ఈ సినిమా పంపిణీ దారుల న‌ష్టాల‌కు లెక్కేలేదు.

ఇక ఈ సినిమాను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన టాప్ ప్రొడ్యుస‌ర్ కం డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజుకు చాలా లాస్ వ‌చ్చిన‌ట్టే. గ‌తేడాది స్పైడ‌ర్ సినిమా దెబ్బ‌తో పాటు తాను పంపిణీ చేసిన ప‌లు సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో రాజుకు రూ.30 కోట్లు పోయాయి. అయితే ఆయ‌న గ‌తేడాది నిర్మించిన ఆరు సినిమాలు హిట్ అవ్వ‌డంతో క‌వ‌ర్ అయిపోయాడు.

ఈ యేడాది సంక్రాంతి నుంచే విజ‌య ప‌రంప‌ర ప్రారంభిద్దామ‌ని అజ్ఞాత‌వాసి సినిమాను కొన్నాడు. ఈ సినిమాను రాజు నైజాం వ‌ర‌కు రూ.28-29 కోట్లుకు కొన్న‌ట్టు వినికిడి. ఇప్పుడు మ‌హా అయితే నైజాంలో రూ.13-15 కోట్ల వ‌ర‌కు లాస్ వ‌చ్చేలా ఉంది. నిర్మాత మ‌హా అయితే రూ.5 కోట్లు ఇచ్చినా రాజుకు రూ. 8-10 కోట్ల వ‌ర‌కు లాస్ త‌ప్పేలా లేదు. దీంతో దిల్ రాజు చాలా డీలాగా వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడూ చాలా హుషారుగా ఉండే ఆయ‌న ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌డం లేద‌ట‌. ఇక రాజు పంపిణీ చేసే మ‌రో సినిమా వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ. ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో వస్తోంది. ఆ సినిమాను అవుట్ రేట్ కు వరల్డ్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు. మరి ఈ సినిమా ఏమన్నా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ లక్ ను టర్న్ చేస్తుందేమో చూడాలి.

 

అజ్ఞాత‌వాసి ఎఫెక్ట్‌… ఆయ‌న ఎవ్వ‌రితో మాట్లాడ‌డం లేదా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share