భారీ వసూళ్లతో…అల్లుఅరవింద్ సంచలన నిర్ణయం!

September 8, 2018 at 1:07 pm

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంతో గొప్ప స్థానం ఉంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అంజనీ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ ఎంత ఫేమస్ అన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు..ఇప్పుడు కొణిదెల ప్రొడెక్షన్ కూడా తన సత్తా చాటుతుంది. తాజాగా ‘గీత గోవిందం’ సినిమాతో మామూలు విజయాన్నందుకోలేదు ‘గీతా ఆర్ట్స్’. ఈ సినిమా కోసం కేవలం పది కోట్లు ఖర్చే చేసినట్లు తెలిపారు..కానీ లాభాలు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. సాధారణంగా నష్టాల్లో ఉన్నవాళ్లు కూడా తమ సినిమా కాస్త హిట్ అయితే..భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా రచ్చ రచ్చ చేస్తుంటారు. కానీ ఈ విషయంలో అల్లుఅరవింద్ మాత్రం ఎలాంటి ఢాంబికాలకు వెళ్లకుండా చాలా సైలెంట్ గా ఉన్నారు.

6670-geetha-govindam

బాక్సాఫీస్ ట్రెండ్స్ చూస్తే ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థమవుతోంది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్.. రూ.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిందని అంటారు. ఇదిలా ఉటే..చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేయడం ద్వారా భారీగా ఆదాయం అందుకుంది ‘గీతా ఆర్ట్స్’. ఇంకా డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్, రీమేక్ హక్కుల ద్వారా కూడా భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ మద్య ‘గీతా ఆర్ట్స్’ తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాల ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Allu-Aravind

రీసెంట్ గా ఎలాంటి అంచనాలే లేని..కొత్త నటులతో వచ్చిన ‘పేపర్ బాయ్స్’ అల్లు అరవింద్ తన బేనర్ మీద రిలీజ్ చేయడమేంటో అర్థం కాలేదు. అయితే థియేటర్లోకి ఈ సినిమా వచ్చిన విషయం..పోయిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. రిలీజ్ తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా పట్టించుకోలేదు. దీంతో ‘గీత గోవిందం’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆదాయపు పన్ను భారీగా కట్టాల్సివస్తుందని..ఈ సినిమా నష్టాలను అందులో చూపిస్తారని గుస గుసలు వినిపించాయి. గీతా ఆర్ట్స్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Paper-boy-movie-stills-2

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయం కానున్న సినిమా ‘. ఈ మాయ పేరేమిటో’టేకప్ చేశారట. అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా రోజులుగా చూస్తున్నారు కానీ.. బిజినెస్ కావట్లేదు. చిన్న సినిమా విషయంలో షాకింగ్ డెసీషన్స్ తీసుకుంటున్న ‘గీతా ఆర్ట్స్’ ఆంతర్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

భారీ వసూళ్లతో…అల్లుఅరవింద్ సంచలన నిర్ణయం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share