బ‌న్నీ… ఆగ‌స్టు 15న టీజ‌రా… పోస్టరా…!

August 13, 2019 at 12:08 pm

స్టైలీస్‌స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ల కాంబీనేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం షూటింగ్ గుట్టు చ‌ప్పుడు కాకుండా ముందుకు సాగుతుంది. ఇదే త‌రుణంలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమా స‌రిలేరు నీకెవ్వ‌రూ మాత్రం శ‌ర‌వేగంగా ప‌బ్లిసిటి న‌డుమ ముందుకు సాగుతుంది. ఈ ఇద్ద‌రి సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిలుస్తున్నాయి… అయితే ఇప్పుడు ఇద్ద‌రి న‌డుమ మ‌రో కొత్త పోరుకు తెర‌లేచింది…

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ గ‌తంలో న‌టించిన నాపేరు సూర్య అనే సినిమాలో మిలిట్రి ఆఫీస‌ర్‌గా న‌టించాడు. అయితే ఇప్పుడు అదే అనుక‌ర‌ణ‌ను ప్రిన్స్ మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రూలో మిలిట్రి ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య పోలిక చేస్తూ ఇద్ద‌రి అభిమానులు సోష‌ల్ మీడియాలో యుద్ధ‌మే చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల ప్రిన్స్ మ‌హేష్‌బాబు పుట్టిన రోజున చిత్ర యూనిట్ ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. కానీ బ‌న్నీ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏమి లేదు.. అందుకే ఈనెల 15న ఏదైనా ఆప్‌డేట్ ఇవ్వాల‌నే ఆరాటంలో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంద‌ట‌…

అయితే ఆగ‌స్టు 15న బ‌న్నీ కూడా ఓ టీజ‌ర్‌ను గానీ, సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను గానీ విడుద‌ల చేయ‌నున్న‌ద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ సినిమాకు టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. దీంతో సంక్రాంతి బ‌రిలో మ‌హేష్‌బాబును ఢీ కొట్టాలంటే ఖ‌చ్చితంగా ఇప్ప‌టి నుంచే టైటిల్ ప‌బ్లిసిటి కావాల‌నేది అల్లు అభిమానుల కోరిక‌ట‌. అందుకే ప్రిన్స్ వ‌దిలిన‌ట్లుగానే టీజ‌ర్‌ను వ‌దులుతారా… లేక కేవ‌లం సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తారా అనేది స‌స్పెన్స్‌గా మారింది.

బ‌న్నీ… ఆగ‌స్టు 15న టీజ‌రా… పోస్టరా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share