రూ.500కోట్ల‌తో గుంటూరులో సిని స్టూడియో…!!

August 22, 2019 at 9:40 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్పాటు కాక‌ముందు సిని ప‌రిశ్ర‌మ అంతా మ‌ద‌రాసులో ఉండేది. అక్క‌డే తెలుగు న‌టులంతా నివాసం ఏర్పాటు చేసుకుని తెలుగు సినిమాల్లో న‌టించి మ‌ద‌రాసు ఫిలిం స్టూడియోల‌ల్లో త‌న సినిమాను పూర్తి చేసుకుని విడుద‌ల చేసేవారు. అప్పుడు సిని న‌టులు క‌ష్టాలు చెప్ప‌న‌ల‌వి కాకుండే… మ‌ద‌రాసు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేరు ప‌డ‌టంతో సిని ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చింది… సిని స్టూడియోల‌తో హైద‌రాబాద్ అల‌రారుతుంది…

ఇప్పుడు సినిమా షూటింగ్ చేయాలి అంటే హైదరాబాద్ స్టూడియోస్ లోనే షూటింగ్ చేయాలి. హైదరాబాద్లో తప్పించి తెలుగు రాష్ట్రాల్లో స్టూడియోలు లేవు. విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆ దిశగా అడుగులు పడుతున్నా.. ఇంకా అక్కడ నిర్మాణాలు ఏర్పాటు కాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాణాలు హైదరాబాద్లోనే నిర్మితమౌతున్నాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కావ‌డంతో సిని స్టూడియోలు ఏపీలో ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌తో అనేక మంది సిని పెద్ద‌లు ఉన్నార‌ట‌…

అందుకే హైదరాబాద్ నుంచి సిని స్టూడియోలు త‌మ ప్రాంతానికి త‌ర‌లించే ప‌నిలో ఆంధ్ర సిని పెద్ద‌లు ఆలోచిస్తున్నార‌ట‌.. అందుకే గుంటూరు జిల్లాలో దాదాపు రూ. 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నట్టు సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు అయన తెలిపారు. హాలీవుడ్లోని డిస్ని థీమ్ పార్క్ తరహాలో గుంటూరు జిల్లాలోని సూర్యలంకలో ఈ స్టూడియోను నిర్మించాలని అనుకుంటున్నారట. ఏపీ టూరిజం శాఖ సమన్వయంతో ఈ స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఏపీలో సినిమా రంగానికి జీవం పోసినట్టే అవుతుంది.

రూ.500కోట్ల‌తో గుంటూరులో సిని స్టూడియో…!!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share