బాహుబ‌లిని దాటిన సాహో బిజినెస్‌…!

August 13, 2019 at 5:40 pm

టాలీవుడ్ లెక్క‌ల‌ను సాహో సినిమా మార్చ‌బోతుందా…? బాహుబ‌లి సినిమాను త‌ల‌ద‌న్నేలా సాహో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే సాహో రికార్డు స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌డంతో సాహో చిత్ర యూనిట్ ఖుషీ ఖుషీగా ఉంది. ఇంత‌కు సాహో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎలా ఉందో ఓసారి లుక్కేద్దాం…

సాహో సినిమా ఈనెల 30న విడుద‌ల‌కు సిద్దం అయింది. అయితే ట్రైల‌ర్ విడుద‌ల త‌రువాత సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. దీంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా క‌ళ్ళు చెదిరే రీతిలో జ‌రిగిన‌ట్లు అన‌ధికారికంగా తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం సాహో చిత్రం 144కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇది టాలీవుడ్లో రికార్డు బిజినెస్‌గానే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే బాహుబ‌లి చిత్రం రూ.125కోట్ల బిజినెస్ చేసిన‌ట్లు రికార్డులున్నాయి.

నాన్ బాహుబ‌లి చిత్రంగా వ‌స్తున్న ఈ చిత్రం మాత్రం బాహుబ‌లి చిత్రాన్నే మించిపోతుంది. ఇక ఏరియాల వారిగా బిజినెస్ చూస్తే క‌ళ్ళు తిర‌గ‌డం ఖాయం. కోస్తాంధ్ర‌లో సినిమా ఏకంగా రూ.60కోట్ల బిజినెస్ చేసింద‌ట‌. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావ‌రి జిల్లాల్లో రూ.19కోట్లు, ఇక సీడెడ్‌లోని రూ.25కోట్ల బిజినేస్‌, నైజాంలో రూ.40కోట్ల బిజినెస్ చేసింద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే నైజాం ఏరియాలో యూవీ క్రియోష‌న్ స్వంతంగానే విడుద‌ల చేసుకుంటుంద‌ట‌. అంటే కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే సాహో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంటే ఇక క‌న్న‌డం, త‌మిళం, మ‌ళ‌యాళం, హిందిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంతుంటుంద‌నేది చ‌ర్చే. అంటే ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్‌నే షేక్ చేయ‌బోతుంద‌ట సాహో సినిమా. ఇక సినిమా విడుద‌ల అయితే త‌ప్ప ఎంత వ‌సూలు చేస్తుందో చెప్ప‌లేం.

బాహుబ‌లిని దాటిన సాహో బిజినెస్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share