బాల‌య్యకు ఆ హీరోయిన్ బికినీ ట్రీట్‌

August 16, 2019 at 11:40 am

ఒక వైపు నాగార్జునతో నటించడానికి మంచి హీరోయిన్లు దొరుకుతున్నా మిగతా సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు హీరోయిన్లు దొరకడం చాలా పెద్ద కష్టమైన పనిగా మారిపోయింది. చిరంజీవికి హీరోయిన్లు వెత‌క‌డానికి పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారు. బాల‌య్య చేసిన హీరోయిన్ల‌తోనే రిపీట్ చేస్తున్నాడు. సోనాల్ చౌహాన్‌, రాధికాఆఫ్టే, న‌య‌న‌తార ఇలా వీళ్లే బాల‌య్య‌కు హీరోయిన్లుగా రిపీట్ అవుతున్నారు.

ఇక త‌మ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ లాంటి వాళ్లు సీనియ‌ర్ హీరోయిన్ల‌తో రొమాన్స్‌కు ఓకే చెపుతున్నా వారి రేట్లు చుక్క‌ల్లోనే ఉంటున్నాయి. ఇక బాల‌య్య మాత్రం త‌న కొత్త సినిమాల‌కు త‌న‌తో చేసిన పాత హీరోయిన్ల‌నే ప‌దే ప‌దే వాడుతున్నాడు. బాల‌య్య తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో న‌టిస్తోన్న‌ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక మరియు భూమిక చావ్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ చాలా గ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. మాల్దీవ్స్ మరియు బ్యాంకాక్ లలో జరిగిన షూటింగ్‌లో ఆమె బికినీతో యువతను ఉర్రూతలూగించేలా రెచ్చిపోయి మ‌రీ అందాలు ఆర‌బోసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఆమె రూ.45 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అవ‌కాశాలు లేక హెబ్బాపటేల్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు ఇంతకంటే తక్కువ రెమ్యూనరేషన్ లకు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు…. కానీ బాలకృష్ణ వంటి సీనియర్ హీరో తో సినిమా అంటే వారు ఒప్పుకోవడం లేదు. అందుకే సోనాల్ చౌహాన్ ఇప్పుడు సీనియర్ హీరోల కి బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.

బాల‌య్యకు ఆ హీరోయిన్ బికినీ ట్రీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share