బండ్ల గ‌ణేష్ గ్యాంగ్‌…!

August 16, 2019 at 12:31 pm

బండ్ల గ‌ణేష్ అనే క‌మేడియ‌న్ అయిన నేను… నా గ్యాంగ్‌తో సెల్సీ దిగుతున్నాను.. నా గ్యాంగ్‌కు స‌రిలేరు నాకెవ్వ‌రు అంటున్నాడు.. ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రంలో న‌టిస్తున్న న‌టీన‌టులు క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేష్‌తో క‌లిసి స‌ర‌దాగా ఓ సెల్పీ దిగారు. ఈ సెల్పీలో హీరో మ‌హేష్ బాబు లేడు. కానీ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఉన్నాడు…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆర్మీ ఆఫీస‌ర్ అజ‌య్ కృష్ణ‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పుడు హైద‌రాబాద్ ప‌రిసర పాంత్రాల్లో శ‌ర‌వేగంగా జ‌రుకుంటుంది. సినిమాలో వ‌చ్చే రైల్ సీన్ల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రిన్స్ వెళ్ళిపోగానే చిత్ర న‌టీన‌టులు బండ్ల గ‌ణేష్ నేతృత్వంలో ఓ గ్యాంగ్ సెల్పీ దిగింది. క్యారెక్ట‌ర్ న‌టి హ‌రితేజ ఈ సెల్పీని తీసింది.

సెల్పీ దిగిన న‌టుల్లో హీరోయిన్ ర‌ష్మీక మంద‌న్న‌, సీనియ‌ర్ హీరోయిన్ సంగీత‌తో పాటు పలువురు న‌టులున్నారు. అయితే ఇందులో బండ్ల గ‌ణేష్ త‌ల‌కు ఎర్ర‌టి బ్యాండ్ ధ‌రించి ఉన్నాడు. అంటే ఈసినిమాలో బండ్ల గ‌ణేష్ ఎర్ర‌బ్యాండ్‌తో క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కూడా న‌టిస్తున్నారు.

బండ్ల గ‌ణేష్ గ్యాంగ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share