నంద‌మూరి ఫ్యాన్స్‌కు షాక్ న్యూస్‌… బాల‌య్య వార‌సుడికి సినిమాలు ఇష్టంలేదా…

June 14, 2019 at 12:35 pm

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరుగులేని మాస్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. బాల‌య్య శాత‌క‌ర్ణి సినిమాతో వంద సినిమాలు కంప్లీట్ చేసుకుని ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 105వ సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇక బాల‌య్య కోస్టార్ అయిన చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు ఇప్ప‌టికే త‌మ త‌న‌యుల‌ను వెండితెర హీరోలుగా ప‌రిచ‌యం చేశారు. వీరిలో రామ్‌చ‌ర‌ణ్ టాప్ హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. ఇక నాగార్జున త‌న‌యులు చైతు, అఖిల్ ఇద్ద‌రు కెరీర్ ప‌రంగా ఎత్తుప‌ల్లాల ఆట‌లోనే ఉన్నారు. వీరికి స‌రైన హిట్ రాలేదు. ఇక ఇప్పుడు బాల‌య్య మాత్రం త‌న త‌న‌యుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నాడు.

రెండు సంవ‌త్స‌రాలుగా మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నా… బాల‌య్య మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. ఇక ఇండ‌స్ట్రీలో అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మోక్ష‌జ్ఞ‌కు సినిమాలు చేయ‌డం ఇష్టం లేద‌ని తెలుస్తోంది. బిజినెస్‌లో ఎదగాలనకుంటున్న మోక్షజ్ఞ ఇప్పటి వరకు నటన మీద దృష్టి పెట్టలేదన్న ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్‌లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌.

ఈ వార్తే నిజ‌మైతే నంద‌మూరి అభిమానుల‌కు పెద్ద షాకే. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ నుంచి వ‌రుస‌గా హీరోలు వ‌స్తూనే ఉన్నారు. నంద‌మూరి ఫ్యామిలీలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ మాత్ర‌మే ఉన్నారు. బాల‌య్య త‌న‌యుడి ఎంట్రీ కోసం క‌ళ్లుకాయ‌లు కాచేలా ఉన్న నంద‌మూరి అభిమానులు తాజా న్యూస్ తీవ్ర నిరాశ‌ను క‌లిగిస్తోంది. ఇక ఇటీవ‌ల రెండు, మూడుసార్లు కెమేరా కంటికి చిక్కిన మోక్ష‌జ్ఞ‌ను చూస్తే చాలా లావుగా, బొద్దుగా ఉన్నాడు. దీనిని బ‌ట్టి చూస్తే ఫిజిక్‌, లుక్‌మీద మోక్ష‌జ్ఞ దృష్టి పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా త‌న‌యుడి సినిమా ఎంట్రీపై బాల‌య్య స్వ‌యంగా క్లారిటీ ఇస్తే కాని ఈ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డేలా లేదు.

నంద‌మూరి ఫ్యాన్స్‌కు షాక్ న్యూస్‌… బాల‌య్య వార‌సుడికి సినిమాలు ఇష్టంలేదా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share