మెగాస్టార్ పై పుకార్లు నిజ‌మేనా..!

August 13, 2019 at 5:03 pm

రాజ‌కీయ నాయ‌కుడి నుంచి పూర్తి స్థాయి న‌టుడిగా మారిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పాత చిరంజీవిగా మారేందుకు తంటాలు ప‌డుతున్నాడు. అందుకు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం, కేరీర్ మైలురాయి చిత్రం అయిన ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో మ‌న‌ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి ఫిజిక్ న‌ట‌న‌కు స‌హాక‌రించ‌ని విధంగా ఉన్న‌ద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే..

అయితే చిరంజీవి 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. చిత్రం అక్టోబ‌ర్‌2న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. అయితే చిరంజీవి 152వ చిత్రంకు రెడి అవుతున్నాడు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అయితే ఈ చిత్రంకు చిరంజీవి కొత్త చిరంజీవిని ప‌రిచ‌యం చేశాడు. కొర‌ట‌ల శివతో సినిమాలో చిరంజీవి రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్క‌బోతుందట‌. అందుకే పాత్ర డిమాండ్ చేయ‌డంతో చిరంజీవి జిమ్ బాట ప‌ట్టాడు…

ఒంట్లో పేరుకు పోయిన కొవ్వును త‌గ్గించుకునేందుకు జిమ్‌లో గంట‌ల కొద్ది క‌ష్ట‌ప‌డ్డాడ‌ని అందుకే పాత రూపును సంత‌రించుకుని మ‌ళ్ళీ పాత రూపంలోకి వ‌చ్చాడ‌ని అంద‌రు అనుకుంటుండ‌గా కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంత‌కు చిరంజీవిపై వ‌స్తున్న పుకార్లు నిజ‌మేనా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. మెగాస్టార్ జిమ్ చేయ‌లేద‌ని, ఏదో స‌ర్జ‌రీ చేయించుకుని స‌న్న‌బ‌డ్డాడ‌ని పుకార్లు వ‌స్తున్నాయి. ఈ వ‌య‌స్సులో స‌ర్జ‌రీ చేయించుకుంటే ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని జిమ్ చేసి ఉంటాడ‌ని మ‌రోవైపు అంటున్నారు. ఏదేమైనా చిరంజీవిపై వ‌స్తున్న ఈపుకార్లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మో కాల‌మే స‌మాధానం చెపుతుంద‌ని పలువురు అంటున్నారు.

మెగాస్టార్ పై పుకార్లు నిజ‌మేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share