సాయి తేజ్ ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

April 12, 2019 at 1:42 pm

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

టైటిల్ : చిత్రలహరి
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : కిషోర్‌ తిరుమల
నిర్మాత : రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి

వ‌రుస ప‌రాజ‌యాల‌తో వెన‌కంజ‌లో ప‌డిపోతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్రేక్ష‌కుల ముందుకు శుక్ర‌వారం ఎమోష‌న్‌ల డ్రామా క‌థ‌తో ముందుకు వ‌చ్చారు. సాయి ధ‌ర‌మ్ న‌టించిన చిత్ర‌ల‌హ‌రి సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లై సంద‌డి చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్‌ తేజ్ మొద‌ట్లో రెండు మూడు సినిమాల‌తో మంచి మార్కులే కొట్టేశాడు. సుప్రీమ్ సినిమాతో త‌న‌కంటూ ఓ రేంజ్ ఉంద‌ని నిరూపించుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే విన్నింగ్ చిత్రం కోసం ఈగ‌ర్‌గా వేయింట్ చేస్తున్న సాయికి ప్రేక్ష‌కులు మ‌రి చిత్ర‌ల‌హ‌రితోనైనా హిట్టును క‌ట్ట‌బెట్టారా లేదా అన్న‌ది ఇప్పుడు చుద్దాం..!

కథేంటంటే… :
విజయ్‌ కృష్ణ (సాయి ధరమ్‌ తేజ్‌) జీవితంలో విజ‌యం అంటే ఎంటో తెలియ‌ని కుర్రాడు. పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నా అని ఆ కుర్రాడు నిరుత్సాహ‌ప‌డినా.. తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైనా సక్సెస్‌ అవుతాడన్న విశ్వాసంతో ఉంటాడు. త‌న‌కు వ‌చ్చిన ఓ మంచి ఆలోచ‌న‌తో యాక్సిడెంట్‌లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్ ప‌రిక‌రాన్ని త‌యారు చేస్తాడు. దాని స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్ర‌మంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్‌) పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్ధాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్‌. కానీ ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. అప్ప‌టి నుంచి విజ‌య్‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంది. ఆ బాధ విజ‌య్‌ను వెంటాడుతుంది. తనకు ప్రేమలోనూ సక్సెస్‌ దక్కలేదని మరింత కుంగిపోతాడు. అలాంటి విజయ్‌ తిరిగి ఎలా సక్సెస్‌ సాధించాడు..? ఈ కథలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) పాత్ర ఏంటి? అన్న విష‌యం తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే మ‌రి.
ఎవ‌రెలా న‌టించారంటే..
సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సారి తాను గతంలో చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్‌ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్‌లో చాలా బాగా ఒదిగిపోయాడు. తన స‌హ‌జ‌శైలి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఎంతో మెచ్యుర్డ్‌ పర్ఫామెన్స్‌తో విజయ్‌ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్ పాత్ర‌కు న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కుదురుకోలేద‌ని చెప్పాలి. మరో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. అయితే కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఎలా ఉందంటే..
సెన్సిబుల్‌ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్‌ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్‌ తీసుకున్నారు. నేటి యూత్ సక్సెస్‌ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్‌ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను చూప‌డంలో విజ‌యం సాధించార‌నే చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్‌ కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్‌ లేకపోవటం కూడా సినిమాకు మైనస్గా మారింది.

కిషోర్‌ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్‌ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇటీవల వరుసగా ఫెయిల‌వుతున్నా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్‌ కొట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

సాయి తేజ్ ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share