ఎవ‌రు ప్రీ రిలీజ్ బిజినెస్‌…!

August 14, 2019 at 4:25 pm

క్రైం థ్రిల్ల‌ర్ తో తెర‌కెక్కిన చిత్రం ఎవ‌రు. ఈ చిత్రంలో అడ‌వి శేషు క‌థ‌నాయ‌కుడు. రెజినా క‌థానాయిక‌. ఈ సినిమా ఈనెల 15న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో తెలుసుకోవాల‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే క‌ళ్ళు తిరగాల్సిందే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌ల అవుతున్న ఈ చిత్రం భారీ ఫ్రీరిలీజ్ బిజినెస్ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు.

ఎవ‌రు సినిమాను క్రైంను బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు వెంక‌ట్ రాంజీ తెర‌కెక్కించాడు. ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిన్న చిత్రానికి భారీ స్పంద‌న వ‌స్తుంద‌నే ఆశ‌తో చిత్ర యూనిట్ ఉంది. అడ‌వి శేషు న‌టించిన గూడ‌చారి సినిమా మంచి విజ‌య‌మే సాధించింది. గూడాచారి ఇచ్చిన విజ‌యంతో ఎవ‌రు అనే చిత్రంలో న‌టిస్తున్నాడు అడ‌వి శేషు. ఈ సినిమా శ‌ర్వానంద్ న‌టించిన ర‌ణ‌రంగంతో పోటీ ప‌డుతుంది.

అయితే ఈచిత్రం ఫ్రీ రిలిజ్ బిజినెస్‌ను చూస్తే ఇలా ఉన్నాయి. సుమారు రూ.10కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింద‌ట చిత్రం. ఏరియాల వారిగా చూస్తే నైజాంలో రూ.2.80కోట్లు, వైజాగ్‌లో 95ల‌క్ష‌లు, రెండు గోదావ‌రి జిల్లాల్లో 1.10కోట్లు, సీడెడ్‌లో రూ.1.15కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ.1.65కోట్లు, క‌ర్నాట‌క‌లో రూ.50ల‌క్ష‌లు, కృష్ణ‌, గుంటూరు, నెల్లూరు జిల్లాలో 1.70కోట్ల‌కు, రెస్టాఫ్ ఇండియాలో 15ల‌క్ష‌ల‌కు చొప్పున బిజినెస్ చేసింది చిత్రం. అయితే చిత్ర పండితుల అంచనా ప్ర‌కారం ఈసినిమా సూప‌ర్‌ హిట్ కావాలంటేరూ.15కోట్ల వ‌ర‌కు వసూలు చేయాల్సి ఉండ‌గా, బ్లాక్ బ్ల‌స్ట‌ర్ కావాలంటే రూ.15కోట్ల‌కు పైగా వ‌సూలు చేయాల్సి ఉంది. ఈసినిమా ఏమేర‌కు వ‌సూలు చేస్తుందో వేచిచూడాలి మ‌రి.

ఎవ‌రు ప్రీ రిలీజ్ బిజినెస్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share