ఎవ‌రు వ‌ర్సెస్ ర‌ణ‌రంగం.. ఎవ‌రిది పైచేయి…!!!

August 16, 2019 at 1:42 pm

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన రోజు పంద్రాగ‌స్టు.. ఈ రోజునాడు టాలీవుడ్‌లో ఇద్ద‌రు హీరోలు హోరాహోరీగా ర‌ణ‌రంగానికి దిగారు.. ఎవ‌రితో ఎవ‌రు ర‌ణ‌రంగం కు దిగారు. ఈ ర‌ణ‌రంగం లో ఎవ‌రు విజేతలు అయ్యారు.. ఎవ‌రు ఓడారు.. లేక ఇద్ద‌రు స‌మ ఉజ్జిలుగా నిలిచారు.. ఈ పోరులో గెలుపెవ‌ర‌ది.. ఓట‌మెవ‌రిది… ఓసారి చూద్దాం…

టాలీవుడ్ బాక్సాఫీసు వ‌ద్ద హోరాహోరీగా యుద్ధానికి దిగింది యువ హీరోలు శ‌ర్వానంద్‌, అడ‌వి శేషు. ఇద్ద‌రు హీరోలు జెండా పండుగ రోజునాడే తాము న‌టించిన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. మ‌రి బాక్సాఫీసు వ‌ద్ద ఎవ‌రు గెలిచారు.. అనే ప్ర‌శ్న త‌లెత్తుంది.. శ‌ర్వానంద్ న‌టించిన చిత్రం ర‌ణ‌రంగం. అడ‌వి శేషు న‌టించిన చిత్రం ఎవ‌రు. ఇద్ద‌రి చిత్రాలు ఓకే రోజు విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను రంజింప చేయ‌డంలో ఎవ‌రు విజ‌యం సాధించారో…

శ‌ర్వానంద్ సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌ణ‌రంగం చిత్రంలో హీరోగా న‌టించాడు. ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌గా శ‌ర్వానంద్ మొద‌టిసారి వెండితెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చాడు. అయితే ద‌ర్శ‌కుడు ఓ చ‌క్క‌టి సందేశాత్మ‌కమైన లైన్ తీసుకుని క‌థ రాసుకున్నాడు. కానీ క‌థ క‌థ‌నాలు చాలా స్లోగా సాగ‌డంతో సినిమా కొంత బోరింగ్‌గా ఉంద‌నేది టాక్‌. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, ప్రేమ స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. అనుకున్న క‌థ‌ను అనుకున్న రేంజ్‌లో మ‌ల‌వ‌క‌పోవ‌డం ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం. అయినా ద‌ర్శ‌కుడు చిత్రంలో ఎక్క‌డ అధిక లోఫాలు ఉన్నాయ‌నే విధంగా జాగ్ర‌త్త ప‌డ్డాడు…

ఇక ఎవ‌రు చిత్రంకు వ‌స్తే … ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంక‌ట్ రామ్‌జీ రాసుకున్న క‌థ‌ను అనుకున్న‌ట్లుగానే తెర‌కెక్కించాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక హీరో అడవి శేషు, హీరోయిన్ రెజీనాలు త‌న ప‌రిథి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. ఓ కొత్త క‌థ‌ను తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల చేత కూడా ద‌ర్శ‌కులు ప్ర‌సంశలు పొందుతున్నాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు క్రైమ్ స‌న్నివేశాలను, క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌ల‌ను బాగా ర‌క్తి క‌ట్టించాడు. న‌టులు సినిమాలో మంచిగా న‌టించాడ‌రు. అయితే ఎవ‌రు, ర‌ణ‌రంగం రెండు సినిమాల‌కు పోల్చుకుంటే ఎవ‌రు సినిమాకే మొగ్గు చూపెట్టాల్సి వ‌స్తుంది… సో ఈ రెండు సినిమాలో పోటాపోటీగానే ఉన్న‌ప్ప‌టికి ఎవ‌రు సినిమాకే ఓటేయ్య‌క త‌ప్ప‌దు…

ఎవ‌రు వ‌ర్సెస్ ర‌ణ‌రంగం.. ఎవ‌రిది పైచేయి…!!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share