బిగ్ బాస్ టాక్ యావ‌రేజ్‌..మరి సూప‌ర్‌ రేటింగ్స్ ఎలా?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర షో బిగ్ బాస్‌. స్టార్ మా ఛానెల్‌లో గ‌త మూడు వారాలుగా ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ షో ఎట్ట‌కేల‌కు నిల‌బ‌డిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. షో ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ హోస్ట‌ర్ అన‌గానే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ వ‌ర‌కు ఓకే అనిపిస్తున్నా ఈ షోలో కంటెస్టెంట్లు మ‌రీ వీక్‌గా ఉండ‌డంతో ఈ షోకు అనుకున్న రేంజ్‌లో టాక్ రాలేదు.

చాలా మంది అయితే ఇదో ప్లాప్ షో అని కూడా విమ‌ర్శించారు. బిగ్ బాస్ స్క్రిఫ్ట్ చాలా వీక్‌గా ఉంద‌ని, అనుకున్న రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేద‌ని పెద‌వి విరిచారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా బిగ్ బాస్ షో రేటింగ్స్ అయితే ప‌డిపోవ‌డం లేదు. రెండో వారంలో కూడా ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోయాయి. రెండో వారంలోనూ స్టార్ మా ఛానెల్ నెంబ‌ర్ వ‌న్ ఛానెల్‌గా ఉంది. గ‌త ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ 12.7 టీఆర్పీతో వారంలోనే టాప్ రేటింగ్ ద‌క్కించుకుంది.

ఇక గ‌త వారం యావ‌రేజ్‌గా చూసుకుంటే ఈ షోకు 12.1 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారంలో సింగ్ మ‌ధుప్రియ ఎలిమినేట్ అవ్వ‌డం, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు మధ్య‌లోనే వెళ్లిపోవ‌డం, హాట్ హీరోయిన్ దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాటు ఎన్టీఆర్ వ్యాఖ్యానం బిగ్ బాస్ షోను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి. ఓవ‌రాల్‌గా ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు దీనిని కంటిన్యూగా చూడ‌డంతోనే ఈ షోకు రేటింగ్ త‌గ్గ‌డం లేదు.