భారీ ప్లాప్ దిశ‌గా ‘ ఇస్మార్ట్ శంక‌ర్‌ ‘

July 23, 2019 at 11:52 am

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రామ్‌ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కిన శంకర్ నాలుగు రోజులకు రూ. 21.42 కోట్ల షేర్ రాబట్టాడు. తొలి రోజు ఏకంగా ఎనిమిది కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన శంకర్ ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. చాలా రోజుల తర్వాత హీరో రామ్ తో పాటు…. ఆరు వరుస ఫ్లాపుల తర్వాత పూరీకి హిట్ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఈ సినిమా హిట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక్కడ హిట్‌ టాక్ తో దూసుకు వెళ్తున్న శంక‌ర్‌కు ఓవర్సీస్ లో అదిరిపోయే దెబ్బ పడింది. అక్కడ శంకర్ డిజాస్ట‌ర్ బాట‌లో నడుస్తోంది. ప్రీమియర్ల ద్వారా 51,677 డాలర్లను, గురువారం 31,893, శుక్రవారం 41,579, శనివారం 56,898 డాలర్లును రాబట్టిన ఈ సినిమా మూడు రోజులకు కలిపి 183,338 డాలర్లను మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బిజినెస్‌కు వ‌స్తోన్న వ‌సూళ్ల‌కు కంపేరిజ‌న్ చేసి చూస్తే ఓవ‌ర్సీస్‌లో ఇస్మార్ట్ డిజాస్ట‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

దీనిని బ‌ట్టి పూరి మాస్ మంత్రం ఓవ‌ర్సీస్‌లో ప‌ని చేయ‌లేదు. ఇదిలా ఉంటే ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు ప‌ర‌మ రొటీన్ క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇటీవ‌ల వ‌చ్చిన మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడినా ఓవ‌ర్సీస్‌లో అంచ‌నాలు ఏ మాత్రం అందుకోలేక బ‌య్య‌ర్ల‌ను న‌ష్ట‌ప‌రిచింది. మ‌హేష్‌కు సూప‌ర్ మార్కెట్ ఉన్న అక్క‌డే అలా జ‌రిగింది అంటే ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుడి అభిరుచి పూర్తిగా మారింద‌నే చెప్పాలి.

భారీ ప్లాప్ దిశ‌గా ‘ ఇస్మార్ట్ శంక‌ర్‌ ‘
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share