ఎన్టీఆర్ కొత్త ల‌వ‌ర్ ఈ అమ్మాయే…

July 23, 2019 at 10:22 am

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లతో రూపొందుతోన్న మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ప‌క్క‌న ఓ విదేశీ హీరోయిన్ కావాల‌ని ముందు నుంచి అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే డెయిసీ ఎడ్గార్‌ జోన్స్‌ని ఆ పాత్రకి ఎంపిక చేయ‌గా… ఆమె కార‌ణం ఏంటో గాని తెలియ‌దు.

ఈ క్ర‌మంలోనే అప్ప‌టి నుంచి విదేశీ అమ్మాయి పాత్ర‌కు రాజ‌మౌళి అన్వేష‌ణ‌లోనే ఉన్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌కు ముందుగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియాభ‌ట్‌ను ఎంపిక చేశారు. ఇక మూడు నెల‌లుగా ఎన్టీఆర్ ప‌క్క‌న ఎవ‌రు ? న‌టిస్తార‌న్న‌దానిపై పెద్ద స‌స్పెన్సే నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకు ఎన్టీఆర్‌కు జోడీగా మ‌రో విదేశీ అమ్మాయిని రాజ‌మౌళి సెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించేందుకు ఎమ్మా రాబర్ట్స్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింద‌ట‌. ఆమె వైల్డ్‌ ఛైల్డ్‌, నెర్వ్‌ తదితర చిత్రాల్లో నటించింది. రాబ‌ర్స్ హాలీవుడ్లో అంత పాపుల‌ర్ కాక‌పోయినా రాజ‌మౌళి ఎన్టీఆర్ ప‌క్కన రాసుకున్న రోల్ కోసం ఆమె సూట్ అవుతుంద‌ట‌. అందుకే ఫైన‌ల్‌గా ఆమెను ఎంపిక చేశార‌ని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ – ఎమ్మా మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్లు అన్నింటిని ఒకే షెడ్యూల్‌లో ఫినిష్ చేసేలా ప్లాన్ జ‌రుగుతోంద‌ట‌.

ఎన్టీఆర్ కొత్త ల‌వ‌ర్ ఈ అమ్మాయే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share