
కేఎ పాల్.. ఈపేరు తెలియని వారుండరు కాబోలు.. ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో తన హావభావాలతో.. తన పనులతో… తన మాట తీరుతో.. తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడే కేఎ పాల్. ఇప్పుడు అదే కేఎ పాల్ కోర్టు తలుపు తట్టాడు.. నాకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ.. ఆ చిత్రంలో నన్ను చాలా ఛండాలంగా చూపించారు.. మీరే నాకు న్యాయం చేయాలి అని కోర్టు మెట్లు ఎక్కాడు పాల్..
పాపం పాల్ రాజకీయాల్లో జగన్‌కు విలన్‌గా మారుతాడని అంతా భావించారు.. కానీ కాలం కలిసిరాలేదు.. అనుకున్న పథకం పారలేదు.. అందుకే విలన్‌కు బదులు జోకర్‌గా మారాడు. ఇప్పుడు అదే పాత్రను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చూపించబోతున్నారు. కేఎ పాల్ పాత్రను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చూపబోతున్న తరుణంలో పాల్ హైకోర్డును ఆశ్రయించారు.
హైకోర్టులో వేసిన కేఎ పాల్ వేసిన ఈ పిటిషన్ 13వ బేంచ్‌కు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలి చేశారు న్యాయమూర్తి. అయితే పిటిషన్ మరో బేంచ్‌కు బదిలి కావడంతో ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్లో ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ, ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను చేర్చారు. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హైకోర్టు నుంచి విముక్తి లభిస్తుందో లేదో అనే అనుమానాలు నెలకొన్నాయి.