
సినిమా ఇండస్ఠ్రీ కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని హలీవుడ్ లోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలో కూడా నటీమణులు గగ్గోలు పెడుతున్నారు. సినిమా ఛాన్స్ లు అంటూ ఎంతో మంది యువతుల జీవితాలతో దళారులు ఆడుకుంటున్నారని..వారిని శారీరకంగా వాడుకుంటున్నారని అయినా ఛాన్స్ లు వస్తాయో రావో అన్న పరిస్థితుల్లో ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మద్య శ్రీరెడ్డి చేసిన ఆందోళన గురించి అందరి తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలేకుండా అంతా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు.
మరోవైపు శ్రీరెడ్డి లాంటి వాళ్లు కాస్టింగ్ కౌచ్ పై పోరాటాలు చేస్తామని ప్రకటించుకున్నారు. ఓ వైపు కాస్టింగ్ కౌచ్ ఇంత జరుగుతుంటే, మరోవైపు కాజల్ మాత్రం పరిశ్రమలో అస్సలు కాస్టింగ్ కౌచ్ లేదంటోంది. టాలీవుడ్ లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విషయమే తనకు తెలియదంటోంది ఈ హీరోయిన్. తను కొత్తగా వచ్చిన హీరోయిన్ కాదు, దాదాపు 12 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది. ఇలాంటి సీనియర్ హీరోయిన్ ఇలా అనడం విడ్డూరం అంటున్నారు.
కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఒకటి మాత్రం చెప్పగలను. అమ్మాయిల్ని సేఫ్ గా ఉండమని చెప్పేకంటే, మగాళ్లు మరింత రెస్పాన్సిబుల్ గా ఉండేలా చేయాలి. ఇలాంటి పనులు చేయకూడదని చిన్నప్పట్నుంచే అబ్బాయిలకు నేర్పించాలి. ప్రతి ఇంటి నుంచి ఇది మొదలుకావాలి.” ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయం చర్చకు వచ్చింది. లవ్ లో పడేసేలా తనకు ఎవరూ ఎదురుకాలేదని, రాబోయే రోజుల్లో కూడా ఎవరూ అలా దొరక్కపోతే, తన తండ్రి తనకో మంచి సంబంధం వెదికిపెడతారని అంటోంది.