ఎంబీ టీమ్ వ‌చ్చేస్తోంది

November 8, 2018 at 11:01 am

టాలీవుడ్ హీరోలు కొత్త పంథాలో న‌డుస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ మైండ్‌తో ముందుకు వెళ్తున్నారు. నూత‌న నిర్మాణ సంస్థ‌ల్ని ఏర్పాటు చేసుకుని ముందు చూపును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంటే.. న‌ట‌న‌తోపాటు ఇత‌ర వ్యాపారాల్లో బిజీ అవుతున్నార‌న్న‌మాట‌. ఇప్ప‌టికే హీరో రాంచ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో నూత‌న నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీస్తున్నాడు. అంతేగాకుండా.. న్యూ టాలెంట్ కోసం వేట మొద‌లు పెట్టాడు. కొత్త‌వాళ్ల‌తో సినిమాలు తీయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌.

461

ఇప్పుడు హీరో మ‌హేశ్‌బాబు కూడా ఇదే దారిలో న‌డుస్తున్నాడు. ఇప్పటికే ఎంబీ( మ‌హేశ్ బాబు) ప్రొడక్షన్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించి తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవ‌ల‌ మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా ఆయ‌న అడుగుపెట్టాడు. ఇక నుంచి ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్‌లో కొత్త వారితో సినిమాలు తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. న్యూటాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌న్న‌దే ఆయ‌న ల‌క్ష్య‌మ‌ట‌. ఈ సంస్థ ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్లను ప‌రిచ‌యం చేస్తూ.. కొత్త పంథాలో సినిమాలు నిర్మించాల‌న్న ఆలోచ‌న‌లో మ‌హేశ్ ఉన్నార‌ట‌.

ఇందు కోసం ఎంబీ టీమ్‌ను కూడా రెడీ చేస్తున్నార‌ట‌. అయితే.. మ‌న అగ్ర‌హీరోల ఆలోచ‌న‌లో మార్పు రావ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణం కూడా ఉంద‌నే చెప్పుకోవాలి. ఈ మ‌ధ్య వ‌స్తున్న చిన్న సినిమాలు మంచి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్‌-100, త‌దిత‌ర చిన్న‌సినిమాలు మాంచి హిట్టు కొట్టాయి. భారీ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్ – యువీ క్రియేషన్స్ – మైత్రీ మూవీమేకర్స్ కూడా చిన్న సినిమాల వైపు చూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌కు మ‌హేశ్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ అంశంపై నమ్ర‌త క‌నుక ద‌`ష్టి సారిస్తే.. ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్‌కు తిరుగు ఉండ‌ద‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఎంబీ టీమ్ వ‌చ్చేస్తోంది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share