మ‌హేష్‌బాబు ఏ పార్టీ ఎమ్మెల్యే..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఫ్యామిలీకి తెలుగు రాజ‌కీయాల‌తో పెద్ద అనుబంధ‌మే ఉంది. ఆయ‌న తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా గెలిచారు. కృష్ణ సోద‌రుడు ఆదిశేషగిరిరావు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు.

ఇక మ‌హేష్‌బావ‌, కృష్ణ పెద్ద అల్లుడు జ‌య‌ద‌వ్ గ‌ల్లా టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా ఉన్నారు. జ‌య‌దేవ్ త‌ల్లి, మ‌హేష్ అత్త గ‌ల్లా అరుణ మాజీ మంత్రి కాగా, ప్ర‌స్తుతం టీడీపీ చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇలా రాజ‌కీయంగా మ‌హేష్ ఫ్యామిలీ తెలుగు పాలిటిక్స్‌లో స‌త్తా చాటుతూనే ఉంటోంది.

వీరి బాట‌లోనే ఇప్పుడు మ‌హేష్ సైతం పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అవుతున్నాడు. అయితే వారంతా రియ‌ల్ లైఫ్‌లో రాజ‌కీయాల్లో ఉంటే ఇప్పుడు మ‌హేష్ ఓ సినిమా కోసం రీల్ లైఫ్‌లో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో మ‌హేష్ న‌టిస్తోన్న స్పైడ‌ర్ సినిమా షూటింగ్ ఎండింగ్‌లో ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మ‌హేష్ కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్‌లోకి జంప్ అవుతాడు.

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మ‌హేష్ ఎమ్మెల్యేగా న‌టిస్తాడ‌ని కాదు కాదు సీఎంగా చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి మ‌హేష్ సీఎంగా చేస్తాడో ? లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో ? రివీల్ కాక‌పోయినా ప్ర‌స్తుతం నెక్ట్స్ షెడ్యూల్‌కు అసెంబ్లీ సెట్ వేస్తున్నారు.

మ‌రి మ‌హేష్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా వెండితెర‌ను ఎలా షేక్ చేస్తాడు ? ఏ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడు ? ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను త‌న సినిమాలో ట‌చ్ చేస్తాడా ? అన్న ప్ర‌శ్న‌లు కాస్త ఉత్కంఠ‌గా ఉన్నాయి.