మ‌హేష్ తో పూజ హెగ్డే …ఆ వార్త హల్ చల్ !

September 12, 2019 at 10:42 am

సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు న‌టిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్నది. అయితే ఇందులో ఓ మాస్ మ‌సాల సాంగ్‌ను కూడా చిత్రించ‌నున్నార‌ట‌. ఈ మాస్ మ‌సాల సాంగ్‌లో జిగేల్‌రాణి ని తీసుకుంటున్న‌ట్లు సిని ప‌రిశ్ర‌మ‌లో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమాలో మాస్ మ‌సాల సాంగ్ కోసం ద‌ర్శ‌కుడు ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలుస్తుంది.

ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీతో కొండారెడ్డి బురుజుకు సంబంధించిన షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తరువాత మిగతా మిగతా షూటింగ్ ను వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నాట‌. నవంబర్ వరకు షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నది. ఇందులో మహేష్ బాబు ఇంట్రో సాంగ్ ఉన్నది. ఈ సాంగ్ లో మొదట మీనాక్షి దీక్షిత్ ను తీసుకోవాలని అనుకున్నా.. అనిల్ రావిపూడి తమన్నా వైపుకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ఇంట్రో సాంగ్ లో పూజా హెగ్డే నటిస్తోందని దానికోసం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాల్సి ఉన్నది. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సో దేవి శ్రీ సంగీతానికి జిగేల్‌రాణి నృత్యానికి మ‌హేష్‌బాబు మెరుపులు మెరిపించ‌డం ఖాయ‌మ‌న్న మాట‌..

మ‌హేష్ తో పూజ హెగ్డే …ఆ వార్త హల్ చల్ !
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share