మ‌న్మ‌థుడు క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా…?

August 13, 2019 at 4:36 pm

నాగార్జున,రకుల్ ప్రీత్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మధుడు 2 బాక్సాపీస్ వద్ద బొక్క‌బోర్లా ప‌డింది. లేటు వ‌య‌స్సులో ఘాటు రోమాన్స్ న‌డిపిన కింగ్ నాగార్జున‌కు ఈ సినిమా ప‌రాజ‌యం ఓ చెంప‌పెట్టుకానున్న‌ది. అయితే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరుగగా ఇప్పటికి కేవలం 8.7కోట్ల వసూళ్లు మాత్రమే దక్కించుకుంది. అంటే అమ్మిన దాంట్లో ఇంకా 50 శాతం వసూళ్లు కూడా ఇంకా రికవరీ కాలేదని అర్థం అవుతుంది.

ఇంకా రెండు రోజులలో ఎవరు,రణరంగం చిత్రాల విడుదల నేపథ్యంలో ‘మన్మధుడు2’, 20కోట్ల వసూళ్లకు చేరుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారంలానే కనబడుతుంది. సో ఈ సినిమాలో అటు బ‌య్య‌ర్లు, ఇటు నిర్మాత‌లు పూర్తిగా మునిగిపోయారనే చెప్ప‌వ‌చ్చు. ఇక నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సీన్లు సినిమాలో పండినంత‌గా, ప్రేక్ష‌కుల మ‌దిలో పండ‌లేక‌పోయింది…

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ళు ఖాయ‌మ‌ని న‌మ్మిన బ‌య్య‌ర్లు నిట్ట‌నిలువునా మునిగారని సినిపండితులు అంటున్నారు. వాస్త‌వానికి నాగార్జున ఇప్పుడు రొమాంటిక్, కామేడి క‌న్నా సందేశాత్మ‌క చిత్రాల‌ను ఎంచుకుంటే బాగుంటుంద‌నేది జ‌నం అభిప్రాయం. ఇలా రొమాంటిక్ పాత్ర‌లు చేయాల్సింది నాగార్జున కొడుకులు నాగ చైత‌న్య‌, అఖిల్ అని అంటున్నారు… సో ఇక‌నైనా నాగార్జున సందేశాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పిస్తార‌ని ఆశిద్దాం…

మ‌న్మ‌థుడు క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share