ఆగ‌స్టు15 మెగాహీరోల‌కు డ‌బుల్ థ‌మాకేనా…!

August 13, 2019 at 1:08 pm

ఆగ‌స్టు 15.. ఈరోజు దేశానికే పండుగ రోజు… ఈపండుగ రోజున దేశ ప్ర‌జ‌లంతా పండుగ ఉత్సాహంతో ఉప్పొంగిపోయేలా మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లాడ‌నుండ‌గా.. ఇదే రోజున టాలీవుడ్ మెగాహీరోలు మ‌రో పండుగ జ‌రుపుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నారు… ఏంటంట‌రా… అదేనండీ మెగా హీరోలు తమ సినిమాల‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో డ‌బుల్ థ‌మాకా కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

స్టైలీష్‌స్టార్ అ్ల‌లు అర్జున్ త‌న 19వ సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. సినిమా ఇప్ప‌టికే స‌గం పూర్తి చేసుకుంది. సంక్రాంతికి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈసినిమాకు ఇంత‌వ‌ర‌కు టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. అంటే ఈ సినిమాకు టైటిల్ ఖ‌రారు చేసిన ఫ‌స్ట్‌లుక్‌ను ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

ఇక మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రం నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈచిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ నేతృత్వంలో తెర‌కెక్కుతుంది. అయితే ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను ఈనెల 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఇక క్రేజీ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఇది కేవ‌లం సినిమా వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే. ఈ చిత్రంను ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మ‌ల్టీస్టార‌ర్ చిత్రం. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రం కు సంబంధించి ఇంకా టైటిల్ ఖ‌రారు కాలేదు. చిత్రంలోని కొమ‌రం భీమ్‌, అల్లూరి సితారామ‌రాజు పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ ఇంత‌వ‌ర‌కు విడుద‌ల కాలేదు.. అయితే ఇదే రోజున అంటే ఆగ‌స్టు 15న‌ రాజ‌మౌళి కొమ‌రం భీమ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంకు సంబంధించిన ఆప్‌డేట్ కూడా తెలుస్తుంద‌న్న మాట‌.

ఇక‌పోతే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం సైరా.. భార‌తదేశం బ్రిటీష్ పాల‌కుల చేతుల్లో బందిగా మారిన నేప‌ధ్యంలో స్వాతంత్య్రం కోసం జ‌రిగిన పోరులో అసువులు బాసిన స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అత‌డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. ఆగ‌స్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం కావ‌డంతో ఆ రోజు చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వినికిడి… సో ఆగ‌స్టు 15 మెగా హీరోలంద‌రికి శుభ‌దిన‌మే…పండుగ రోజే…

ఆగ‌స్టు15 మెగాహీరోల‌కు డ‌బుల్ థ‌మాకేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share