నాని గ్యాంగ్‌లీడ‌ర్ సెన్సార్ రిపోర్ట్ …!

September 11, 2019 at 5:09 pm

నేచురల్ స్టార్ నానీ నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్ చిత్రం ఎట్ట‌కేల‌కు సెన్సార్ పూర్తి చేసుకుంది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 13న‌ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయ్యేవరకు కూడా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అవ్వలేదు. దీంతో మూవీ యూనిట్‌తో పాటు బయ్యర్స్ కూడా కాస్త కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు ఇవాళ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది నాని గ్యాంగ్ లీడర్.

కేవ‌లం రీవెంజ్ కోణంలో తీసిన చిత్రం ఈ గ్యాంగ్‌లీడ‌ర్‌. సినిమా మొత్తం ఫ‌న్నీగా ఉండ‌టంతో ఈ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చేశారు. ఇక మూవీలో నాని యాక్టింగ్, కామెడీ టైమింగ్ అదిరిపోయిందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు టాక్. ద‌ర్శ‌కుడు విక్రమ్ కె కుమార్ స్క్రీన్‌ప్లే బాగున్న‌ట్లు, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా సినిమాకు మెయిన్ అస్సెట్ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఏడాది నాని ఖాతాలో మరో హిట్ పడుతుంది.

గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా థ్రిల్లర్ కామెడీ తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్ల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రఘుబాబు, సత్య, ప్రణ్య, జైజా తదితరులు కీలక పాత్రలలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

నాని గ్యాంగ్‌లీడ‌ర్ సెన్సార్ రిపోర్ట్ …!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share