” నిన్ను కోరి ” ఫ‌స్ట్ షో టాక్‌

నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు ప‌ట్టిందల్లా బంగారం అవుతోంది. ఎవ‌డే సుబ్రహ్మణ్యం నుంచి నాని న‌టించిన సినిమాలు వ‌రుస‌గా హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే నాని న‌టించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నాని జెంటిల్‌మ‌న్ సినిమాలో జోడీ క‌ట్టిన నివేద థామ‌స్ జంట‌గా న‌టించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి మ‌రో కీల‌క రోల్‌లో న‌టించాడు. నాని వ‌రుస హిట్ల నేప‌థ్యంలో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం.

ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం నిన్న కోరి సినిమాలో మరోసారి త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో మెప్పించాడు. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో నాని న‌ట‌నా విధానం, ఇక నివేద థామ‌స్‌, ఆది పినిశెట్టితో పాటు ముర‌ళీశ‌ర్మ కూడా సినిమాకు మేజ‌ర్ హైలెట్‌గా నిలిచారు. సినిమా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌గా ఈ సినిమా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

సినిమా క‌థానుగుణంగా పల్లవి (నివేద థామస్) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త అరుణ్ (ఆది పినిశెట్టి), తన ఫస్ట్ లవ‌ర్‌ ఉమా మహేశ్వరరావు(నాని) మధ్య నలిగిపోయే పాత్రలో నటించింది. వైజాగ్ లో మొదలైన ఈ సినిమా స్టోరీ ఆపై ఢిల్లీకి, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకు వెలుతుంది.

ప్ల‌స్ పాయింట్స్ ( +) :

– నాని, నివేద థామ‌స్ యాక్టింగ్‌

– యూత్‌కు క‌నెక్ట్ అయ్యే క‌థ‌నం

– ఎమోష‌న‌ల్ సీన్లు

– సెకండాఫ్‌

– నిర్మాణ విలువ‌లు

– సాంకేతిక‌త‌

మైన‌స్ పాయింట్స్ (-):

– స్లో స్క్రీన్ ప్లే

– పాత ఫార్ములా ప్రేమ క‌థ‌

– యావ‌రేజ్ ఫ‌స్టాఫ్‌

– బీ, సీ సెంటర్ల‌కు క‌నెక్ట్ కాని క‌థ‌నం

ప్రీమియ‌ర్ షో టాక్ తీర్పు :

యావ‌రేజ్ నిన్ను కోరి