నానిపై శ్రీరెడ్డి శృంగార వ్యాఖ్యలు

June 11, 2018 at 4:05 pm

సెల‌బ్రిటీల‌పై ఘాటైన వ్యాఖ్య‌ల‌తో.. హాటైన‌ చేష్ట‌ల‌తో ఫేమ‌స్ అయిపోయి.. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన‌ శ్రీ‌రెడ్డి మరోసారి వ‌చ్చింది. ఈసారి ఆమె ఎవ‌రిని టార్గెట్ చేస్తుందా అని ఎంతో కాలం నుంచి అటు మీడియా, ఇటు ఆమె అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూసుకుని మ‌రీ.. మ‌ళ్లీ స్టార్ హీరోపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. `ఆఫ‌ర్` ఇస్తాన‌ని చెప్పి త‌న‌ను వాడుకున్నాడంటూ బిగ్‌బాస్‌-2 హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నేచుర‌ల్ స్టార్ నానీపై శ్రీ‌రెడ్డి హాట్ కామెంట్లు చేసింది. గ‌తంలో తాను పాపుల‌ర్ అవ‌డానికి తెలుగు హీరోయిన్ల సెంటిమెంట్ భుజాన కెత్తుకుని త‌ర్వాత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన ఈ అమ్మ‌డు మ‌రోసారి నానిపై చేసిన వ్యాఖ్య‌లు ఇండస్ట్రీలో సంచ‌ల‌నం రేపుతున్నాయి. త‌న‌ను వాడుకున్నది నిజ‌మో కాదో.. తన కొడుకుపై ఒట్టేసి చెప్పాల‌ని ఆమె చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.

మ‌ళ్లీ మీడియాకు కావాల్సినంత మ‌సాలా దొరికే స‌మ‌యం వ‌చ్చేసింది. టీవీ రేటింగ్లు పెంచుకునే ప్రోగ్రాంలు మ‌రిన్ని నిర్వ‌హించేందుకు సెల‌బ్రిటీ దొరికేసింది. మొన్న‌టివ‌ర‌కూ ఒక రేంజ్‌లో రేటింగ్లు పెంచుకున్న చాన‌ళ్లు మ‌సాలా దొర‌క్క సాదాసీదా వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నాయి. ఒక్క‌సారి ఆమెను ప్రోగ్రామ్‌కు పిలిచి.. సెల‌బ్రిటీ స్టాట‌స్ క‌ట్ట‌బెట్టేసిన చాన‌ళ్ల‌కు మ‌రింత హాట్ న్యూస్ దొరికింది. శ్రీ‌రెడ్డి మ‌ళ్లీ వ‌చ్చింది. వ‌స్తూ వ‌స్తూ త‌న‌తో పాటు హాట్ కామెంట్లు కూడా తీసుకొచ్చింది. తాను టైమ్‌ని కాదు.. టైమింగ్‌ని న‌మ్ముతాన‌ని ప‌వ‌న్ చెప్పిన డైలాగ్‌ను చెప్పి మ‌రీ వ‌చ్చింది. బిగ్‌బాస్‌-2 ప్రోగ్రామ్ ప్రారంభించే రోజే.. ఆ కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నానిపై షాకింగ్ కామెంట్లు చేసింది. జ‌నం అనుకున్న‌ట్లు నానీ అంత మంచోడేం కాదు.. అత‌డు కూడా కులం అండ‌తోనే ఇండ‌స్ట్రీలో ఎదిగాడు అంటూ వ్యాఖ్యలు చేసింది.

బిగ్‌బాస్‌-2లో నాని వ‌ల్లే త‌న‌కు అవ‌కాశం రాలేద‌ని చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి. మూడు నెల‌లుగా ఖాళీగా ఉన్న త‌న‌కు బిగ్‌బాస్ ద్వారా మంచి అవ‌కాశం ద‌క్కింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో.. నాని కార‌ణంగా చివ‌రి నిమిషంలో ఆ అవ‌కాశం చేజారింద‌ని తెలిపింది. `గ‌తంలో చాన్స్ ఇస్తాన‌ని వాడుకున్న నాని.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాల‌కు అడ్డు త‌గులుతున్నాడు. ఉప్ప‌ల‌పాటి ర‌వి అనే ప్రొడ్యూస‌ర్‌తో చేయ‌బోయే సినిమాలో చాన్స్ ఇస్తాన‌ని చెప్పి న‌న్ను ఎక్స్‌ప్లాయిట్ చేశాడు. ఆధారాలు లేక‌పోవ‌డంతో మొద‌ట్లో వీటిని చెప్పేందుకు భ‌య‌పడ్డాను. సాక్ష్యాలు లేకపోయినా నాకు జ‌రిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోమ‌ని లాయ‌ర్ చెప్ప‌డంతో నాని పేరు బ‌య‌ట‌పెట్టాను.` అంటూ కామెంట్లు చేసింది శ్రీ‌రెడ్డి. ఇక్క‌డితోనే కాదు మ‌రిన్ని విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది.

నాని సినిమాలో పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వ‌డ‌ని హీరోయిన్‌తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల ఎంపిక‌లోనూ జోక్యం చేసుకుంటాడ‌ట‌. `అమ్మాయిల‌ను నాని వాడుకున్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌రెడ్డిని తాను ముట్టుకోలేద‌ని త‌న కొడుకు మీద ఒట్టేసి చెబితే నేను చేసిన ఆరోప‌ణ‌ల్ని వెన‌క్కి తీసుకుంటాను` అని స‌వాలు కూడా విసిరింది శ్రీ‌రెడ్డి. నాని ద‌ర్శ‌కుల‌ను బాగా ఇబ్బంది పెడ‌తాడ‌ని, ఎంసీఏ సినిమా స‌మ‌యంలో సాయిప‌ల్ల‌విని కూడా ఇబ్బంది పెట్టాడంటూ మ‌రో బాంబు పేల్చింది. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో వేచిచూడాల్సిందే!

నానిపై శ్రీరెడ్డి శృంగార వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share