బాహుబలి రూట్లో వెళ్తున్న బాలయ్య

August 12, 2018 at 7:05 pm

తెలుగు చిత్ర‌సీమ‌లో బాహుబ‌లిది అద్వితీయ స్థానం.. తెలుగు సినిమాకు గ్లోబ‌ల్ ర్యాంకు తెచ్చి పెట్టిన ఘ‌న‌త దాని సొంతం. ఇక‌ ఈ సినిమాకు సంబంధించి అన్నీ ప్ర‌త్యేక‌మే.. ప్లానింగ్‌, మేకింగ్‌, ప‌బ్లిసిటీ, ప్ర‌మోష‌న్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్ర‌తీది జ‌నాన్ని క‌ట్టిప‌డేసిందే. ఇందుకు ఆ చిత్ర‌యూనిట్ రేయింబ‌వ‌ళ్లు.. నాలుగైదు ఏళ్లు.. అవిశ్రాంత శ్ర‌మ ఫ‌లిత‌మే. అంతేగాకుండా. ఈ సినిమాకు రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ, అంత‌ర్జాతీయ మార్కెట్ సంపాదించ‌డం స‌రికొత్త రికార్డు. ఇందుకు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అనుస‌రించిన పంథానే వేరు. ఇప్పుడు న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర‌తో రూపొందుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను కూడా బ‌హుబ‌లి దారిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆ చిత్ర‌యూనిట్ ప‌క్కా ప్లాన్ చేస్తోంద‌ట‌.

baahubali2-1200

అదేమిటంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాలీవుడ్‌, త‌మిళ‌, క‌న్న‌డ‌.. త‌దిత‌ర ప్రాంతాల న‌టుల‌ను తీసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌కృష్ణ కీ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ తార విద్యాబాల‌న్ కూడా న‌టిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఉంటున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో ప‌నిచేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్‌’లో చిరు పాత్ర కనిపిస్తుందా? లేదా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నిజంగానే.. చిరు పాత్ర ఉంటే.. అందులో ఎవరు నటిస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది.

622daefe55d234f11813f11ab3ba3916

ఇదంతా కూడా ఎన్టీఆర్ సినిమాకు జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించేందుకు చిత్ర యూనిట్ ప‌క్కా ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. వీలయినంత మంది తమిళ, కన్నడ, బాలీవుడ్ నటులను తీసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తెలుగులో మహేష్ బాబు కూడా దాదాపుగా ఖ‌య‌మైన‌ట్లు స‌మాచారం. మ‌రి కొద్దిరోజుల్లోనే కన్నడ, తమిళ, బాలీవుడ్‌కు చెందిన మ‌రికొంద‌రి నటుల పేర్లు బయటకు వస్తాయని ఇండ‌స్ట్రీ టాక్‌. ఇక అప్పుడే అస‌లు సిస‌లు ప్ర‌చారం మొద‌లువుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. ద‌ర్శ‌కుడు క్రిష్‌, హీరో బాల‌క‌`ష్ణ‌కు అత్యంత ప్ర‌తిష్టాకర‌మైన ప్రాజెక్టు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వీరి ప్లానింగ్ ఏ మేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి మ‌రి.

బాహుబలి రూట్లో వెళ్తున్న బాలయ్య
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share