పాగ‌ల్‌గా వ‌స్తున్న ఫ‌ల‌క్‌న‌మా దాస్‌…!

August 14, 2019 at 5:52 pm

ఫ‌ల‌క్‌న‌మా దాస్ సినిమాతో తెరంగ్రేటం చేసిన హీరో విశ్వ‌క్ సేన్‌. ఇప్పుడు ఫ‌ల‌క్‌న‌మా దాస్ ఫాగ‌ల్‌గా రాబోతున్నాడు. ఈచిత్రంను త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు తీసుకురావ‌డానికి చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. విశ్వ‌క్ సేన్ హీరోగా చేస్తుండ‌గా, హీరోయిన్‌, ఇత‌ర సాంకేతిక నిపుణులు, న‌టుల‌ను త్వ‌ర‌లో ఎంపిక చేయ‌నున్నారు.

హీరో విశ్వ‌క్ సేన్ ఫ‌ల‌క్‌న‌మా దాస్ చిత్రంతో ఫేమ‌స్ అయ్యాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ లాగే త‌ను కూడా ఎవ‌రి అండ లేకుండా సిని ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు. విశ్వ‌క్ సేన్ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ లాగే వివాదాల్లోకి దూరి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చాడు. అయితే విశ్వ‌క్ సేన్ మాత్రం ఇవ‌న్నీ ఏమి ప‌ట్టించుకోకుండానే మ‌రో సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ఫాగ‌ల్ సినిమా రాబోతుంది. ఫాగ‌ల్ టైటిల్ తోనైనా విశ్వ‌క్‌సేన్ త‌ను హిట్ కొడుతాడో చూడాలి. బెక్కం వేణుగోపాల్ ఇంత‌కు ముందు హుషార్ సినిమాను రూపొందించాడు. ఆ చిత్రం హిట్ కొట్టింది. ఇప్పుడు విశ్వ‌క్‌సేన్‌తో ఫాగ‌ల్ చిత్రంను త‌న ల‌క్కీ మీడియాపై నిర్మిస్తుండ‌గా నరేష్ కుప్పిలి అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. సో ఈ ఫాగ‌ల్ సినిమా ఓ ల‌వ్ స్టోరీగా రాబోతుంద‌ట‌.

పాగ‌ల్‌గా వ‌స్తున్న ఫ‌ల‌క్‌న‌మా దాస్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share