ఛాన్స్ ఇస్తే..నాకేమిస్తావ్ అన్నాడు?! : పాయల్ రాజ్ పూత్

October 19, 2018 at 12:41 pm

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘మీటూ’ ఉద్యమం ఉధృతం అయ్యింది. ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాదు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలు సైతం మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమ పట్ల జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాంటి వారి రహస్యాలు బహిరంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లాంటి వారు ఇండస్ట్రీలో తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టారు. వారితో పాటు పలువురు నటీమణులు కూడా గతంలో జరిగిన లైంగిక దాడుల గురించి గళం విప్పారు.

Payal-Rajput-770x450

ఈ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 తో మంచి పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ తన పట్ల లైంగిక వేధిలపులు జరిగిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. విజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పూత్. ఈ సినిమాల ఎక్కువ శాతం బోల్డ్ కంటెంట్ ఉన్న విషయం తెలిసిందే..అయితే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాయల్ ఆ మద్య తన వద్దకు ఓ వ్యక్తి వచ్చి తనకు సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పాడట..అయితే హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..తనకు ఏమిస్తావని అడిగాడట.

అతడి మాటల్లో తేడా ఉండటంతో వెంటనే కోపం చెంప ఛెల్లుమనిపించానని..ఇలాంటి పిచ్చి వేశాలు తన వద్ద సాగవని హెచ్చరించి పంపించేశానని అన్నది. అయితే తన వద్దకు వచ్చిన వ్యక్తి వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు ఈ హాట్ బ్యూటీ. కాగా, ఆర్ ఎక్స్ 100 లో తాను బోల్డ్ గా నటించానని..అలాంటి పాత్రల్లో నటించాలని చాలా ఆఫర్లు వస్తున్నాయని..కానీ అలాంటి పాత్రలు తనకు ఇష్టం లేదని వాపోయింది.

ఛాన్స్ ఇస్తే..నాకేమిస్తావ్ అన్నాడు?! : పాయల్ రాజ్ పూత్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share