‘అరవింద సమేత’ హిట్ తో ఊపిరి పీల్చుకున్న మహేష్, ప్రభాస్!

October 12, 2018 at 6:39 pm

ఇండస్ట్రీలో అందరూ ఊహించినట్టుగానే జరిగింది. టాప్ లీడ్ లో ఉన్న దర్శకుడు, హీరో కలిస్తే..ఏ రేంజ్ హిట్ వస్తుందో నిన్న రిలీజ్ అయిన ‘అరవింద సమేత’సినిమా చూస్తే అర్ధం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి దసరా ముందు రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నారు ఫ్యాన్. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారా..అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఐదో రోజు నుంచి షూటింగ్ లో జాయిన్ అయి సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ తీసుకు వచ్చాయి.

అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో కి అక్కినేని నాగ చైతన్యతో ‘ఒకలైలా కోసం’ చిత్రంలో నటించిన పూజా హెగ్డె ఆ తర్వాత ముకుంద చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో ట్రెడిషినల్ గా కనిపించిన పూజా తర్వాత తెలుగు లో పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘మోహ్ఎంజో దారో’ హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ కొట్టింది, కానీ ఎమ్ చేస్తది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. హృతిక్ రోషన్ లాంటి వాడు ఛాన్స్ ఇచ్చినా అక్కడ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. ఆ దెబ్బతో అమ్మడుకు ‘ఐరెన్ లెగ్‌’ అనే బిరుదు వచ్చింది, దాంతో ఈ అమ్మడికి చాలా గ్యాప్ వచ్చింది.

fyhtrut_5bc0753fdbe61

అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాజ జగన్నాధం’ సినిమాతో హాట్ లుక్ తో అందరికి మైకం కమ్మేలా చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఒకదశలో పూజా హెగ్డే ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. నిన్న ‘అరవింద సమేత’ రిలీజ్ అయ్యింది..అన్ని సెంటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాంతో చిత్ర యూనిట్ తెగ సంబరాలు చేసుకుంటుంది. ఇక ‘ఐరెన్ లెగ్‌’ ముద్ర వేసుకున్న పూజా హెగ్డే ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

త్వరలో మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌ సరసన నటిస్తుంది..ఈ సినిమాలు కూడా హిట్ అయితే..కొంత కాలం వరకు ఈ అమ్మడిని పట్టుకోవడం కష్టం అని అంటున్నారు. ఈ విజ‌యం అటు మహేష్ ఫ్యాన్స్‌కీ, ఇటు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కూడా రిలీఫ్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ‘అర‌వింద‌’ ఫ‌లితం అటూ ఇటూ అయితే… ఆ రెండు సినిమాల‌పై ఆ ప్ర‌భావం ప‌డేదేమో. ఇప్ప‌టికి మాత్రం రిలీఫ్ తీసుకునే ఛాన్స్ దొరికింది.

‘అరవింద సమేత’ హిట్ తో ఊపిరి పీల్చుకున్న మహేష్, ప్రభాస్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share