అమెరికా సెక్స్ రాకెట్ : షాకింగ్ విషయాలు చెప్పిన పూనమ్ కౌర్

June 28, 2018 at 4:00 pm

టాలీవుడ్ లో ఈ మద్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే చెలరేగుతుంది. నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. సినిమాల్లో నటించడానికి వచ్చిన యువతులను కొంత మంది దళారులు దారుణంగా మోసం చేసి తమకు పడక సుఖం అందిస్తేనే సినిమా చాన్సులు అంటూ బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటున్నారని..అలా ఎంతో మంది అమ్మాయిలు తమ మానాన్ని ఫణంగా పెట్టారని ఆరోపించింది.

తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినని తనను ఇండస్ట్రీ పెద్దలు మోసం చేశారని ఆరోపించింది. ఓ వైపు టాలీవుడ్ ని కాస్టింగ్ కౌచ్ బాధపెడుతుంటే..ఇప్పుడు అమెరికా లో సెక్స్ రాకెట్ మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి – అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ పై పూనం కౌర్ మరో బాంబు పేల్చింది. అసలు కిషన్ – చంద్ర దంపతులు భార్యభర్తలే కాదని పూనమ్ బాంబు పేల్చింది. అమెరికాలో కిషన్ – చంద్ర దంపతులపై నమోదైన కేసు గురించి ప్రస్తావిస్తూ ఈరోజు పూనమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అంతే కాదు గతంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని కూడా ప్రస్తావించింది.

అమెరికాలోని ఓ ఈవెంట్ కోసం తాను వెళ్లిన సమయంలో ఒంటరిగా హోటల్ లో ఉన్న నా వద్దకు వాడు వచ్చాడని.. అమాయకమైన అమ్మాయి అనుకొని రెచ్చిపోతే బుద్ది చెప్పానని తెలిపింది. అతడు మాట్లాడింది నాకు అర్థం కాదు అనుకున్నాడని.. కానీ తనకు తెలుగు అర్థం అవుతుందని పూనమ్ తెలిపింది. ఆ సమయంలోనే అతి చేస్తే చెంప పగులకొట్టానని పేర్కొంది. డబ్బు తో లొంగ దీసుకోవాలని అక్కడ చాలా మంది ప్రయత్నిస్తుంటారని ఆరోపించింది.

అమెరికా సెక్స్ రాకెట్ : షాకింగ్ విషయాలు చెప్పిన పూనమ్ కౌర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share