
సాహోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు పారితోషికం ఎంత తీసుకుంటున్నాడో అనేది ఇప్పుడు సిని పరిశ్రమలో చర్చ జరుగుతుంది. సాహో సినిమా నిర్మాణంకు యూవీ క్రియోషన్స్ దాదాపు 300కోట్లకు పైగా బడ్జెట్ కెటాయించిందనే టాక్ ఉంది. అయితే ఈసినిమా ఈనెల 30న విడుదల కానున్నది. ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు హాట్ టాపీక్.
ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు సుమారు రూ.10కోట్లకు పైగా ప్రతి సినిమాకు పారితోషికం తీసుకునేవాడట. అయితే బాహుబలి సినిమా హిట్ అయిన తరువాత ఆయన రేంజ్ పెరిగింది. రేంజ్‌తో పాటు పారితోషికం కూడా పెరిగిందట. బాహుబలికి ప్రభాస్ లాభాల్లో 30శాతం తీసుకున్నట్లు టాక్ ఉంది. అయితే బాహుబలి తరువాత ఆయన తన పారితోషికంను పెంచినట్లు వినికిడి.
ప్రభాస్ సాహో సినిమాకు వచ్చే లాభాల్లో 50శాతం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడట. ఈ విషయం ప్రభాస్‌ను అడిగితే నా పారితోషికం ఎంతో ఇంకా ఒక నిర్ణయంకు రాలేదని, నిర్మాణ సంస్థ మా దోస్తులదే కనుక తరువాత మాట్లాడుకుంటామని చర్చను డైవర్ట్ చేశాడట. అంటే తన రెమ్యూనరేషన్ గురించి మాత్రం కొంచెం కూడా లీక్ కావడం లేదు. సో సాహో సినిమా లాభాల్లో 50శాతమా… లేక నైజాం ఏరియాలో సినిమా అమ్మితే వచ్చే సొమ్ము తీసుకుంటాడా… అనేది ఆసక్తికరంగా ఉంది.