నంద‌మూరి ఫ్యాన్స్‌ను కెలికిన పూరి

July 23, 2019 at 5:20 pm

ఎట్టకేలకు ఐదు సంవత్సరాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ ఆ జోష్ లో ఉన్నాడో ఏమో కానీ వ‌రుస‌ వివాదాస్పద వ్యాఖ్యలతో స్టార్ హీరోల ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారుతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుపై నెగటివ్ గా స్పందించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్‌కు గురయ్యాడు. గతంలో తాను మహేష్ కు రెండు హిట్లు ఇచ్చినా…. మహేష్ మాత్రం తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోలేద‌న్న అక్కసు చూపించిన పూరి మహేష్ హిట్స్‌లో ఉన్న డైరెక్టర్ల‌కే ఛాన్స్ ఇస్తాడంటూ సెటైర్ వేశాడు.

ఇప్పుడు మీరు శంక‌ర్‌తో హిట్ కొట్టారుగా… ఛాన్స్ ఇస్తాడేమో అన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు ఓ క్యారెక్టర్ ఉంది కదా అంటూ మరింత సంచలనంగా మాట్లాడాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి పూరి చెప్పిన ఒక మాట ఇప్పుడు నందమూరి అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్ర‌మంలోనే టెంప‌ర్ సినిమా షూటింగ్ టైంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న చెప్పాడు.

టెంపర్ టైమ్ లో ఎన్టీఆర్ తో ట్రావెల్ చేశాను. ఆ సినిమా కోసం గోవాలో షూట్ చేసిన‌ప్పుడు ఎన్టీఆర్ కారులో వెళ్లాన‌ని… ఆ కారులో వెళ్లడం కంటే నడిచి వెళ్లడం బెటర్ అనిపించేంత ఫాస్ట్‌గా ఎన్టీఆర్ డ్రైవ్ చేశాడ‌ని పూరి చెప్పాడు. అక్క‌డితే ఆగ‌కుండా యాంక‌ర్ జాగ్రత్తగా బండి నడపండి, మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయని సందేశం ఇస్తుంటాడుగా… అలాంటి ఎన్టీఆర్ అంత స్పీడ్‌గా కారు డ్రైవ్ చేస్తాడా ? అని ప్ర‌శ్నించింది.

వెంట‌నే ఎన్టీఆర్ ఊరికే చెబుతాడు తప్ప, పాటించడని అన్నాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూరీపై మండిప‌డుతున్నారు. పూరి నోరు అదుపులో పెట్టుకోక‌పోతే బాగోద‌ని వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల‌కు హిట్ వ‌చ్చింద‌న్న మైకంలో పూరి ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్యాఖ్య‌లు చేస్తూ ట్రోల్‌కు గుర‌వుతున్నాడు.

నంద‌మూరి ఫ్యాన్స్‌ను కెలికిన పూరి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share